‘స్పైడర్’ ఈవెంట్ – సిఎం… సిఎం..!

SPYder Audio Launch - Mahesh babu అట్టహాసంగా జరుగుతోన్న “స్పైడర్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక్కసారిగా ‘సిఎం… సిఎం…’ అన్న నినాదాలతో ప్రిన్స్ అభిమానులు శిల్పకళావేదికను మారుమ్రోగించారు. రాజకీయాలకు దూరంగా ఉండే మహేష్ బాబు సిఎం ఏంటి అనుకున్నారా? ఇక్కడే కొరటాల శివ పేరు చెప్పాలి. అవును… ‘స్పైడర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో ప్రసంగించడానికి వేడుకపైకి కొరటాల శివ వచ్చిన సమయంలో… ఆడిటోరియంలో ఉన్న అభిమానులంతా ‘సిఎం సిఎం’ అంటూ నినదించారు.

అయితే ఇక్కడ సమయస్పూర్తిగా వ్యవహరించిన కొరటాల శివ, ఈ రోజు ‘స్పైడర్’ సినిమా గురించి మాట్లాడుకుందాం… అంటూ ‘భరత్ అనే నేను’ టాపిక్ ను కాస్త డైవర్ట్ చేసి ‘స్పైడర్’ గురించి ప్రసంగించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన నాటి నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, తప్పకుండా మంచి విజయవంతం అవుతుందని ఈ సందర్భంగా సింపుల్ గా చెప్పేశారు. ‘భరత్ అనే నేను’ గురించి కొరటాల తప్పించుకున్నా, దిల్ రాజు మాత్రం పెదవి విప్పారు.

ADVERTISEMENT

ఈ దసరాకు విడుదల కాబోతున్న “స్పైడర్”ను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న తాను, ‘భరత్ అనే నేను’ సినిమాను కూడా పంపిణీ చేస్తున్నానని స్పష్టత ఇచ్చారు. ఈ వేడుకలో ‘భరత్ అనే నేను’ ప్రొడ్యూసర్ డివివి దానయ్య కూడా భాగస్వామ్యం అయ్యారు. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం దిల్ రాజు వ్యక్తపరిచిన సందేహంతో సంక్రాంతి నుండి అధికారికంగా తప్పుకున్నట్లే భావించవచ్చు. బహుశా సమ్మర్ హంగామాకు “భరత్ అనే నేను” సినిమా సిద్ధమవుతుందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories