కండిషన్స్ అప్లై… అది టీజర్ కు మాత్రమే..!

Mahesh Babu Disappointed the Fans with the 'SPYder' Clarification‘స్పైడర్’ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదల చేసిన ప్రమోషనల్ వీడియోలలో… మొట్టమొదటగా విడుదల చేసిన ‘గ్లిమ్స్’ ఆకట్టుకుంది. ఆ తర్వాత విడుదల చేసిన టీజర్ గానీ, ట్రైలర్ గానీ ‘వావ్’ అనే స్పందనను తెచ్చుకోలేకపోయింది. ఇంతకీ అసలు ట్విస్ట్ ఏమిటంటే… ఆ ‘గ్లిమ్స్’ పేరుతో విడుదల చేసిన వీడియో అసలు సినిమాలో ఉండదట. అంతేకాదు, మహేష్ కాళ్ళ మీద పాకుతూ ఎక్కిన రోబోటిక్ ‘స్పైడర్’ కూడా సినిమాలో ఉండదని ప్రిన్స్ మహేష్ బాబు స్పష్టత ఇచ్చారు.

ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని ఖరారు చేయగా, ఇప్పటివరకు నచ్చిన ‘గ్లిమ్స్’ వీడియోనే సినిమాలో ఉండదా… అంటూ ఆశ్చర్యపోవడం ప్రిన్స్ అభిమానుల వంతవుతోంది. అది కేవలం హీరో క్యారెక్టర్ ను ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసమే సదరు రోబోటిక్ ‘స్పైడర్’ను వాడారట. అయితే అంత ఖర్చు పెట్టించి, గ్రాఫిక్స్ వర్క్ చేసిన వీడియో సినిమాలలో లేకపోవడం కాస్త విస్తుగొలిపే విషయమే. ఈ గ్లిమ్స్ వీడియోను లండన్ లోని నైపుణ్యుల చేత ఎంతో ఖర్చుపెట్టి చేయించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories