స్పైడర్… ఈ ‘గ్లిమ్స్’ అదిరింది..!

Mahesh Babu Is Fighting an Unseen Villain - A R Murgadossమరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మురుగదాస్ – మహేష్ బాబుల “స్పైడర్” ప్రమోషన్ కార్యక్రమాలకు ఆదివారం నుండి శ్రీకారం చుట్టబోతున్నారు. సండే నాడు తమిళ ప్రింట్ మీడియాకు ప్రిన్స్ మహేష్ బాబు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇవ్వనుండగా, ఆ తదుపరి రోజు నుండి తెలుగు నాట ఈ హంగామా జరగనుంది. అయితే వీటన్నిటికంటే ముందు మరో ‘గ్లిమ్స్’ను ప్రిన్స్ అభిమానుల కోసం విడుదల చేసారు.

ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్ ను ఓ రెండు నిముషాల్లో కట్ చేసి… బ్యాక్ గ్రౌండ్ లో ‘బూమ్ బూమ్’ సాంగ్ ప్లే చేస్తూ విడుదల చేసిన ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. మహేష్ బాబు గారాలపట్టి సితార చిరునవ్వుతో మొదలుపెట్టిన ఈ వీడియో, అభిమానులకు మహేష్ పెట్టిన నమస్కారంతో ముగుస్తుంది. ఈ మధ్యలో… ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ప్రముఖ వ్యక్తులందరినీ చూపించారు. మరి దీనిపై మీరూ ఓ లుక్కేయండి..!

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories