‘జై లవకుశ’ కూడా ‘సౌండ్’ చేసింది!

Spyder - Jai Lava Kusa Hindi Dubbing Rightsఈ ఏడాది తెలుగు సినిమా ఓ రేంజ్ లో వెలుగుతోంది. సంక్రాంతితో మొదలైన ఈ పరంపర దసరా వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోంది. మధ్యలో ‘బాహుబలి 2’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మోత మోగించగా, తాజాగా దసరా సరదా తీర్చేందుకు ముస్తాబవుతున్న రెండు సినిమాలు “స్పైడర్” మరియు “జై లవకుశ” సినిమాలు బాలీవుడ్ నాట డబ్బింగ్ హక్కుల రూపంలో భారీ రేట్లను దక్కించుకున్నాయి.

ADVERTISEMENT

‘స్పైడర్’ హిందీ డబ్బింగ్ హక్కులు ఇప్పటికే 16 కోట్లకు అమ్ముడై ట్రేడ్ వర్గాలను అవాక్కు చేయగా, తాజాగా ‘జై లవకుశ’ హిందీ హక్కులు కూడా అమ్ముడైపోయినట్లుగా తెలుస్తోంది. అయితే బాలీవుడ్ నాట మహేష్ కున్నంత ఫేం మరియు మార్కెట్ జూనియర్ ఎన్టీఆర్ కు లేదు కాబట్టి, ‘జై లవకుశ’కు 11 కోట్లు చెల్లించినట్లుగా సమాచారం. అయినప్పటికీ ఈ మొత్తం కూడా చాలా ఎక్కువనే చెప్పాలి.

దీంతో తెలుగు సినిమాల వైపు బాలీవుడ్ వర్గాలు ఎంతగా ఎదురుచూస్తున్నాయో అర్ధమవుతోంది. ఈ రెండు సినిమాలు కూడా ‘బాహుబలి 2’ మాదిరే భారీ సక్సెస్ లు అందుకుంటే, బాలీవుడ్ ప్రముఖులంతా టాలీవుడ్ వైపుకు అడుగులు వేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. మరి ఆ విధంగా జరగాలని… జూనియర్ ఎన్టీఆర్ “జై లవకుశ” మరియు ప్రిన్స్ మహేష్ బాబు “స్పైడర్” సినిమాలు కనకవర్షం కురిపించాలని ఆశిద్దాం.

ADVERTISEMENT
Latest Stories