స్పైడర్… సినిమా ఇదే..!

Mahesh Babu - SPYder Latest Newsఈ దసరాకు ప్రిన్స్ మహేష్ బాబు అభిమానుల సరదా తీరుస్తుందని భావిస్తున్న “స్పైడర్”సినిమా ధియేటిరికల్ ట్రైలర్ కు రంగం సిద్ధమైంది. ఇటీవల చెన్నైలో నిర్వహించిన ఆడియో వేడుక గ్రాండ్ సక్సెస్ కావడంతో, మహేష్ బాబు అభిమానులంతా ఫుల్ ఖుషీలో ఉన్నారు. దీంతో హైదరాబాద్ లో జరగనున్న ఈవెంట్ లో రిలీజ్ కానున్న ట్రైలర్ అంచనాలను అందుకుంటే, “స్పైడర్” సినిమా ఓపెనింగ్స్ కు తిరుగుండదు అనేది ట్రేడ్ వర్గాల మాట. అయితే ఈ సినిమా ఎలా ఉంటుందన్నది తాజాగా విడుదల చేసిన ఓ పోస్టర్ చెప్పకనే చెప్తోంది.

కూల్ గా… కన్నింగ్ గా… సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ… విలనిజం ప్రదర్శించే పాత్రలో ఎస్.జే.సూర్య ఓ వైపు…. ఆ కన్నింగ్ నెస్ ను అంతమొందించడానికి తన తెలివితేటలు… శక్తియుక్తులు ప్రదర్శించే పాత్రలో ప్రిన్స్ మహేష్ బాబు మరో వైపు… సింపుల్ గా ‘స్పైడర్’ కధ ఇదే అని మురుగదాస్ ఇచ్చిన పలు ఇంటర్వ్యూల ద్వారా మరియు తాజాగా విడుదలైన ఈ స్టిల్ ద్వారా అర్ధమవుతోంది. వీరిద్దరి మధ్య సాగే సన్నివేశాలు ఎంత రసవత్తరంగా సాగాయో అని చెప్పడానికే “స్పైడర్” ధియేటిరికల్ ట్రైలర్ రాబోతోంది.

ADVERTISEMENT

ప్రేక్షకులను ఎంత ఆసక్తి కలిగించే విధంగా దర్శకుడు మురుగదాస్ చెప్పగలిగాడో… అంత సక్సెస్ ను “స్పైడర్” సొంతం చేసుకుంటుంది. సహజంగా ఇలాంటి సినిమాల విజయం అనేది గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పైనే ఆధారపడి ఉంటుంది. ఆ విషయంలో మురుగదాస్ గనుక విజయవంతం సాధిస్తే… మిగతా భారాన్నంతా తన భుజ స్కందాలపై సినిమా రేంజ్ ను పెంచే సత్తా మహేష్ బాబు సొంతం. దీనికి శాంపిల్ చూడాలంటే అభిమానులు మరికొద్ది గంటలు ఎంతో ఆసక్తిగా వేచిచూడాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories