4వ స్థానంలో “స్పైడర్!”

Spyder Pre Release Businessప్రిన్స్ మహేష్ బాబు కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన “స్పైడర్” సినిమా మరో పది రోజుల్లో ధియేటర్లలో ప్రత్యక్షం కానుంది. దాదాపుగా 120 కోట్ల వ్యయంతో నిర్మాణం జరుపుకున్న ఈ సినిమా కాస్త అటు, ఇటు అయితే నిర్మాతల పరిస్థితి ఏంటి? అన్న ఆలోచన సామాన్య ప్రేక్షకులకు రావడం సహజమే. అయితే నిర్మాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా 150 కోట్లు సొంతమయ్యాయి. దీంతో నిర్మాతల వరకు ‘సేఫ్ జోన్’లోనే ఉన్నారు.

ADVERTISEMENT

తెలుగులో ఇప్పటివరకు ఒక్క “బాహుబలి” రెండు పార్ట్స్ మినహా, ఇతర ఏ చిత్రమూ ఈ రేంజ్ లో బిజినెస్ జరుపుకోలేదు. మురుగదాస్ – మహేష్ ల కాంబో మార్కెట్ వర్గాలలో కావాల్సిన క్రేజ్ ను సృష్టించగా, తెలుగు, తమిళ, మలయాళ భాషలలో విడుదల చేయడం కూడా ‘స్పైడర్’కు బాగానే కలిసి వచ్చిందని చెప్పాలి. అయితే డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కాలంటే, కనీసం ‘బాహుబలి’ పార్ట్ 1 రికార్డులను ‘స్పైడర్’ ఖచ్చితంగా బద్దలు కొట్టాల్సి ఉంటుంది. అంటే ‘బాహుబలి’ 1-2 పార్టుల నడుమ ‘స్పైడర్’ కలెక్షన్స్ ఉండాలి.

టాలీవుడ్ కు వచ్చేసరికి ప్రీ రిలీజ్ బిజినెస్ లో “బాహుబలి 2” మొదటి స్థానంలో ఉండగా, “బాహుబలి 1” రెండవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో ప్రిన్స్ ‘స్పైడర్’ ఉండగా, దక్షిణాది మొత్తంలో ‘స్పైడర్’ కంటే ముందుగా ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ ‘కబాలి’ సినిమా కూడా ఉండడంతో… ఓవరాల్ గా సౌత్ సినీ ఇండస్ట్రీలో “స్పైడర్” నాలుగవ స్థానంలో నిలిచింది. ఈ నాలుగు సినిమాలు కూడా మల్టీ లాంగ్వేజ్ చిత్రాలే కావడం పరిశీలించదగ్గ అంశం. అంటే భవిష్యత్తులో బహు భాషా చిత్రాలకే ఎక్కువ మార్కెట్ ఉంటుందని నిరూపణ అవుతోంది.

ADVERTISEMENT
Latest Stories