ఇటీవల విడుదలై ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరుత్సాహపరిచిన “వీరభోగవసంతరాయలు” మూవీకి సంబంధించి దర్శకుడు ఓ వివాదాస్పదమైన పోస్టర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సినిమా రివ్యూలను టార్గెట్ చేస్తూ… అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ లో ఉన్న సదరు పోస్టర్ పై అన్ని వర్గాల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి.
[m9ad]
ADVERTISEMENT
సినిమాలో విషయం లేకుండా విశ్లేషకులను టార్గెట్ చేయడం కేవలం పబ్లిసిటీ కోసమేనని మండిపడుతున్న తరుణంలో… ఈ పోస్టర్ పై హీరో శ్రీవిష్ణు స్పందించారు. “ఈ వ్యంగ్యర్ధాల పోస్టర్ తో, తనకు ఎలాంటి సంబంధం లేదని, చిత్ర సమీక్షకులను తానెప్పుడూ గౌరవిస్తానని, వారికి నా మద్దతు ఉంటుందని” స్పష్టం చేసారు.
ADVERTISEMENT



