మరో సెలబ్రిటీ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్!

Sri Devi Boney Kapoor Twitter Hackసెలబ్రిటీల సామాజిక మాధ్యమాలకు సంబంధించిన ఖాతాలు వరుసగా హ్యాకింగ్ కు గురవుతున్న నేపధ్యంలో… తాజాగా ఈ జాబితాలో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, అతిలోకసుందరి శ్రీదేవి భర్త బోనీకపూర్ కూడా చేరారు. తన ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కు గురైన విషయాన్ని గుర్తించిన బోనీకపూర్, ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని సైబర్ పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ… బోనీ కపూర్ ట్విట్టర్ ఖాతా 2015 సెప్టెంబర్ 20 నుంచి వాడుకలో లేదని, తన భార్య శ్రీదేవి ఫోటోలను ఆయన చివరి సారిగా పోస్ట్ చేశారని చెప్పారు. బోనీ కపూర్ ట్విట్టర్ ఖాతా యాక్టివ్ గా లేదని గ్రహించిన గుర్తు తెలియని వ్యక్తి ఒకరు, ఆ ఖాతాను మార్చి 3న హ్యాక్ చేశాడని, అంతే కాకుండా, లక్నోలో జరిగే చారిటీ షో కోసం పేటీఎం ఈ-వ్యాలెట్ ద్వారా నిధులు ట్రాన్స్ ఫర్ చేయాలని సదరు నిందితుడు పోస్ట్ చేసినట్లు సదరు ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories