ఏటీఎం ‘రారా’ కోసం వచ్చిన శంకర్ ‘దాదా’

Sri kanth Chiranjeevi - RaRaమెగాస్టార్ చిరంజీవికి, హీరో శ్రీకాంత్ కు ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. చిరుకు మరో సోదరుడు మాదిరి ఉండే శ్రీకాంత్, తన అభిమానం ఏమిటో చిరు డాక్టర్ గా నటించిన ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’ చిత్రంలో ఏటీఎం పాత్ర ద్వారా చూపించారు. అలాంటి శ్రీకాంత్ త్వరలో కామెడీ అండ్ హర్రర్ గా తెరకెక్కిన “రారా” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేయడం సినిమాకు పబ్లిసిటీని తెచ్చిపెట్టింది. తను అడగగానే కాదనకుండా చిరు అన్నయ్య వచ్చి “రారా” ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం పట్ల మెగాస్టార్ కు రుణపడి ఉంటానని హీరో శ్రీకాంత్ వెల్లడించారు. ఇక, ఈ సినిమాను ఎప్పుడెప్పుడూ చూడాలా అన్న ఆసక్తి కలుగుతోందని, హాస్యం జోడించిన హార్రర్ సినిమా ఇదని, పిల్లలకు కూడా బాగా నచ్చే సినిమా అవుతుందని ఈ సందర్భంగా చిరు అభిప్రాయ పడ్డారు.

ADVERTISEMENT

టాలీవుడ్ యువ హీరోల రంగప్రవేశంతో హీరోగా తన ప్రభావాన్ని కోల్పోయిన శ్రీకాంత్, ప్రస్తుతం ప్రేక్షకులను మెప్పిస్తోన్న ‘హార్రర్ అండ్ హాస్యం’ జోనర్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. సోలో హీరోగా సక్సెస్ అనే మాట విని శ్రీకాంత్ కు చాలా సంవత్సరాలే గడిచిపోయాయి. ఒకప్పుడు ఫ్యామిలీ చిత్రాల హీరోగా శ్రీకాంత్ కు ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉండేది. ఇప్పటికీ అదే ఇమేజ్ ఎంతో కొంత ఓపెనింగ్ కలెక్షన్స్ కు కారణమవుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories