టాలీవుడ్ లో ‘కాస్టింగ్ కౌచ్’ అంటూ సంచలనాలకు తెరలేపిన శ్రీరెడ్డి, తాజాగా మరో సెన్సేషన్ కు దారితీసింది. “రెడ్డి డైరీ” అనే పేరుతో తన బయోపిక్ ను తమిళంలో తెరకెక్కిన్చెందుకు సన్నాహాలు చేసుకుంది. చెన్నై వేదికగా దీనిపై ఓ అధికారిక ప్రకటన చేసింది శ్రీరెడ్డి. అల్లావుద్దీన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని పేర్కొంది.
ADVERTISEMENT
[m9ad]
తన జీవితంలో మోసం చేసిన వ్యక్తులకు సంబంధించిన వీడియోలను ఈ సినిమాలో బయట పెడతానని చెప్పుకొచ్చిన శ్రీరెడ్డి, తనకు నడిగర్ సంఘం సహకరిస్తుందని హామీ ఇచ్చినట్లుగా తెలిపింది. అయితే ఇప్పటివరకు ఆరోపణలు మాత్రమే చేసిన శ్రీరెడ్డి, ఈ ‘రెడ్డి డైరీ’లో నిజంగా వాళ్ళ పేర్లు, వీడియోలు బయటపెట్టే ధైర్యం ఉందా? అసలు శ్రీరెడ్డి దగ్గర నిజంగా వీడియోలు ఉన్నాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ADVERTISEMENT



