ఇంత ఓవర్ యాక్షన్ ను తట్టుకోలేరు కదా!

Sridevi-Death-Maaha-TV-Demonstrationశ్రీదేవి ఎలా మరణించింది? అన్న దానిపై భిన్న కధనాలు వ్యక్తం అవుతుండడంతో… మీడియా వర్గాలు ఎవరికీ తోచిన విధంగా వారు తమ తమ ప్రతిభలను బుల్లితెరపై పెడుతున్నారు. అసలు శ్రీదేవి బాత్ టబ్ లోకి ఎలా వెళ్ళింది? ఆ తర్వాత ఏం జరిగింది? అన్న దానిపై త్రీడి రూపంలో ఓ యానిమేషన్ ను పలు మీడియా ఛానల్స్ ప్రజెంట్ చేయగా, మరో మీడియా ఛానల్ ప్రతినిధి అయితే ఏకంగా బాత్ టబ్ లో పడుకుని శ్రీదేవి ఎలా మరణించింది? అన్న దానిని లైవ్ లో చేసి చూపించారు.

ఇంకేముంది… పలు జాతీయ మీడియా సంస్థలు కూడా సదరు ఫోటోను పోస్ట్ చేసి కధనాలు రాసింది. అలా కొద్ది సేపట్లోనే సోషల్ మీడియా కంట కూడా ఆ చిత్రాలు పడ్డాయి. దీంతో సదరు మీడియా ఛానల్ ప్రతినిధి ప్రదర్శించిన అత్యుత్సాహానికి నెటిజన్ల సెటైర్లు తోడయ్యాయి. శ్రీదేవి ఎత్తు 5.6 కనుక, అసలు బాత్ టబ్ లో పడిపోవడం సాధ్యమేనా? అన్న కోణంలో ప్రసారమైన ఈ కధనంలో సదరు యాంకర్ బాత్ టబ్ విన్యాసాలు ట్రోలింగ్ కు గురవుతున్నాయి. ఇంత ఓవర్ యాక్షన్ ను నెటిజన్లు చూస్తూ ఉండలేరు కదా!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories