ఫ్యామిలీ హీరో నుండి మరో వారసుడు!

Srikanth son Rohan Meka debut in Prabhu Deva movieతెలుగు తెరపై హీరోగా శ్రీకాంత్ కి ప్రత్యేకమైన గుర్తింపు వుంది. ఆయన శ్రీమతి ‘ఊహ’ కూడా వివాహానికి ముందు సినిమాల్లో కథానాయికగా నటించారు. ఆ తరువాత నుంచి ఆమె సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ మధ్యనే శ్రీకాంత్ పెద్ద కుమారుడు ‘రోషన్’ కథానాయకుడిగా ‘నిర్మలా కాన్వెంట్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లుక్స్ పరంగా ఈ కుర్రాడు మంచి మార్కులు కొట్టేశాడు. రోషన్ తో పాటు ‘రుద్రమదేవి’ సినిమాలో శ్రీకాంత్ కూతురు ‘మేథ’ కూడా కనిపించింది.

ADVERTISEMENT

ఇక శ్రీకాంత్ రెండవ తనయుడు ‘రోహన్’ కూడా వెండితెరకి పరిచయమవుతున్నాడు. ప్యాషన్ క్రియేషన్స్ బ్యానర్ల పై ఆకాశ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. ప్రభుదేవా ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా, ఇటీవలే ఊటీలో ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. విభిన్నమైన కంటెంట్ తో ఈ సినిమా రూపొందుతున్నట్టుగా సమాచారం.

ADVERTISEMENT
Latest Stories