టాలీవుడ్ క్రేజీయస్ట్ హీరోలైన మహేష్, పవన్ ల పేర్లను, వారి సినిమాల్లో ప్రజాధరణ పొందిన డైలాగ్స్ ను ఇతర సినిమాల్లో వాడుకోవడం షరామామూలే! అయితే ఏ సినిమాలో ఇద్దరినీ ఒకేసారి వాడుకున్నది లేదు. బహుశా ఇదే ఆలోచన ‘జత కలిసే’ దర్శకుడికి వచ్చిందో ఏమో గానీ, మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ ల ‘స్పూఫ్’ను ఒకేసారి వెండితెరపై చూపించబోతున్నారు. దానికి సంబంధించిన ‘పోస్టర్’ను ఇటీవలే చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఈ నెల 25వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ‘శ్రీమంతుడు’ సినిమాలో మామిడితోట ఫైట్ మాదిరి చిత్రీకరణ జరిపిన సన్నివేశాలతో కూడిన టీజర్ ను, పోస్టర్లను ప్రమోషన్లకు వినియోగిస్తున్నారు. మహేష్ గెటప్ లో ‘శ్రీమంతుడు’గా సప్తగిరి కనపడుతుండగా, ‘గబ్బర్ సింగ్’ గెటప్ లో షకలక శంకర్ నటిస్తున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఈ ‘స్పూఫ్’లు చిత్ర ఓపెనింగ్స్ కు కారణమవుతాయని యూనిట్ అంచనా వేస్తోంది.





