ఎస్ఎస్ రాజమౌళి యొక్క భారీ చారిత్రాత్మక చిత్రం, ఆర్ఆర్ఆర్ షూటింగ్ రెండు పాటలు మినహా పూర్తయింది. మొత్తం షూటింగ్ ఆగస్టులో పూర్తయ్యే అవకాశం ఉంది. అల్లూరి సీతా రామరాజు మరియు కొమరం భీమ్ అనే ఇద్దరు లెజెండరీ స్వాతంత్య్ర సమరయోధుల ఆధారంగా తీస్తున్న ఆర్ఆర్ఆర్ ఒక కల్పిత కథ అని రాజమౌళి ఇప్పటికే వెల్లడించారు.
వారి వారి పోరాటాలకు ముందు ఢిల్లీలో వారు కలిసినప్పుడు ఏమి జరుగుతుందో ఈ చిత్రం అని ఏడాది క్రితమే చెప్పేశాడు జక్కన్న. తాజాగా ఒక ఇంటర్వ్యూలో, రచయిత విజయేంద్ర వర్మ మాట్లాడుతూ ఈ చిత్రం కథ కు సంబంధించిన ఇంకో ఆసక్తికరమైన విషయం చెప్పాడు.
“ఈ చిత్రం లో ఇద్దరు స్టార్స్ మధ్య కెమిస్ట్రీ ఒక ప్రధాన హైలైట్ గా నిలుస్తుంది. ఇద్దరూ ఒకే మార్గంలోనే వెళ్తూ ఉంటారు, కానీ దురదృష్టవశాత్తు, వారు ఘర్షణ పడవలసి ఉంటుంది” అని ఆయన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. యాక్షన్ సన్నివేశాలలో చాలా ఎమోషనల్ డెప్త్ ఉంటుందని…. అది మరింత ఆకట్టుకుంటుందని ఆయన అన్నారు.
రామ్ చరణ్ అల్లూరి పాత్రలో, ఎన్టీఆర్ తెలంగాణ వారియర్ పాత్రలో నటించనున్నారు. చరిత్రలో ఎక్కడా కూడా అల్లూరి రామరాజు మరియు కొమరం భీమ్ కలిసినట్టు సమాచారం లేదు. వారిద్దరూ కొట్టుకునట్టు చూపిస్తే వారి అభిమానుల మనోభావాలు గాయపడొచ్చు. చాలా ముందుగానే రాజమౌళి ఇది కల్పిత కథ అని చెప్పేశారు.
అయితే నిజమైన హీరోల విషయంలో కల్పితానికి కూడా ఒక లిమిట్ ఉండాలి. అయితే రాజమౌళి లాంటి దర్శకుడికి ఆ లిమిట్ గురించి చెప్పాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అయితే వివాదాలకు సరైన కారణం ఉండాల్సిన పని లేదని ఇప్పటికే మనం ఎన్నో సార్లు చూశాం.



