గతేడాది షూటింగ్ మొదలెట్టిన ఒక స్టార్ హీరో సినిమాకి భారీగా రీషూట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్, సక్సెస్ ఫుల్ యాక్టర్ కాంబినేషన్, ఓ పెద్ద నిర్మాణ సంస్థ చాలా భారీగా స్థాయిలో ఆ సినిమాని రూపొందించారు. బోలెడు సెట్స్ కూడా వేశారు. షూటింగ్ దాదాపుగా ఓ 70% పూర్తయింది, షూట్ అయినంతవరకు ఎడిట్ చేసి చూసుకున్నారు, అవుట్ పుట్ తాము అనుకున్నదానికంటే బాగా వచ్చిందని మురిసిపోయారు కూడా.
కట్ చేస్తే.. రీసెంట్ గా రిలీజైన ఓ సినిమా చూసి షాక్ అయ్యాడట ఆ స్టార్ డైరెక్టర్. అందులో తాను రాసుకున్న సీన్స్ దాదాపుగా ఉన్నాయట. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ & ప్రీక్లైమాక్స్ లో వచ్చే ఎలివేషన్ అయితే సేమ్ టు సేమ్ అట. దాంతో ఏం చేయాలో తోచని స్టార్ డైరెక్టర్ రీషూట్ తప్ప వేరే దారి లేదని గ్రహించి, తాను ఎంతో అద్భుతంగా వచ్చాయి అనుకున్న సీన్స్ అన్నీ చించేసి.. కొత్త సీన్స్ రాయడం మొదలెట్టాడట.
ఆయన రాసుకోవడం వరకు ఒకే.. ఇక్కడ మళ్లీ స్టార్ హీరో డేట్స్ కుదరాలి. త్వరలోనే మరో సినిమాతో బిజీ అవ్వనున్న సదరు స్టార్ హీరో.. ఇప్పుడు మళ్లీ ఈ డైరెక్టర్ కి డేట్స్ ఇస్తాడా? ఒకవేళ అడ్జస్ట్ చేసి ఇచ్చిన.. మునుపటి స్థాయిలో వచ్చిన అవుట్ పుట్ ని వీళ్లు రీక్రియేట్ చేయగలరా? అనేది పెద్ద ప్రశ్న. ఈ డైరెక్టర్ & యాక్టర్ విషయం పక్కన పెడితే.. పాపం ప్రొడ్యూసర్ ఇప్పుడు మిగతా ఆర్టిస్టుల డేట్స్ ఎలా మ్యానేజ్ చేయాలి, సెట్స్ కి మళ్లీ ఎంత అవుతుంది? ఓవరాల్ గా బడ్జెట్ ఎంత పెరుగుతుంది అనే టెన్షన్ లో ఉన్నాడట.




