ఐపీఎల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన స్టీవ్ వా!

steve-waugh-sensational-comments-on-iplప్రపంచ జట్టులలో ఆసీస్ ను అగ్రగామిగా నిలబెట్టిన కెప్టెన్ గా కీర్తిని సొంతం చేసుకున్న స్టీవ్ వా సంచలన వ్యాఖ్యలకు తెరలేపారు. “బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ వల్ల ఆస్ట్రేలియా క్రికెట్ వైఫల్యాల బాటలో నడుస్తూ నాశనమవుతోందని” ఈ దిగ్గజ క్రికెటర్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టెస్టులతో పాటు వన్డేల్లో ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆస్ట్రేలియా, ఇటీవలి కాలంలో వైట్ వాష్ లకు గురవుతుండటాన్ని విశ్లేషించిన ఈ మాజీ కెప్టెన్ సదరు వ్యాఖ్యలు చేసారు.

ADVERTISEMENT

విరామం లేకుండా రెండు నెలల పాటు ఐపీఎల్ లో ఆడుతున్న కారణంగా ఆటగాళ్లు అలసటకు గురవుతూ, తరువాతి షెడ్యూళ్లలో పూర్తి స్థాయి ప్రదర్శనను కనబరచలేకపోతున్నారని విమర్శలు చేసారు. రెండు నెలల క్రితం లంకతో 3-0తో, ఆపై ఇటీవల దక్షిణాఫ్రికాలో ఐదు వన్డేల సిరీస్ ను 5-0తో ఓడిపోవడం తనను బాధించిందని పేర్కొన్నాడు. తాము క్లబ్ క్రికెట్ లో ఆడిన సమయంలో ఈ తరహా వాతావరణం లేదని, ఇప్పుడు కాంపిటీషన్ తో పాటు, ఆటగాళ్లు గాయాల పాలయ్యే అవకాశాలూ పెరిగాయని అన్నాడు.

అయితే స్టీవ్ వా చేసిన వ్యాఖ్యలను క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు ఖండిస్తున్నారు. ఒక్క ఆస్ట్రేలియా జట్టు పైనే ఐపీఎల్ జరగడం లేదని, ప్రపంచ వ్యాప్తంగా పాకిస్తాన్ మినహా అన్ని జట్ల వారు భాగస్వాములై ఉన్నారని, అయినా ఐపీఎల్ లో ఆడడం వలన ఆస్ట్రేలియా ఆటగాళ్ళు వెలుగులోకి వచ్చారని అంటున్నారు. జట్టుకు దూరమైన షేన్ వాట్సన్ ఐపీఎల్ వలనే మళ్ళీ ఆసీస్ జట్టులో చోటు సంపాదించుకున్నారని గుర్తు చేస్తున్నారు. తన జట్టు పేలవమైన ఆటతీరుకు ఐపీఎల్ ను కారణం చూపడం అవివేకమని స్టీవ్ వా క్రీడాభిమానులు మండిపడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories