సీఎం బాబాయ్ మర్డర్ అయితే హోమ్ మంత్రి పిచ్చ లైట్ అంటున్నారా?

sucharitha comments on ys viveka murder issueచనిపోయింది సీఎం సొంత బాబాయ్.. అది కూడా గత ప్రభుత్వంలో జరిగింది. అప్పట్లో ఇప్పటి ముఖ్యమంత్రి దాని మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ సీబీఐ విచారణ కావాలని హైకోర్టు కు కూడా వెళ్లారు. అయితే ఒక్కసారి అధికారంలోకి వచ్చాకా మొత్తం పరిస్థితి మారిపోయింది. వివేకా హత్యకేసుని ప్రతిపక్షాలు భూతద్దంలో చూపిస్తున్నారని సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అనడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది.

సీఎం సొంత బాబాయ్… వైఎస్సార్సీపీ నిత్యం ఫోటో చూపించి ఓట్లు అడిగే వైఎస్ రాజశేఖరరెడ్డి సొంత తమ్ముడు మరణిస్తే హోంమంత్రి పిచ్చ లైట్ అన్నట్టు మాట్లాడం గమనార్హం. మరోవైపు ఇంకో మంత్రి కొడాలి నాని కూడా ఈ కేసుని చాలా సింపుల్ గా తేల్చి పారేశారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య ఆధారాలను చెరిపేశారంటూ కొడాలి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందువల్లే హంతకులను పట్టుకోలేకపోతున్నట్లు కొడాలి చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

హత్య జరిగిన మూడు నెలల వరకూ చంద్రబాబు సీఎంగా ఉన్నారని, అప్పుడు హంతకులను పట్టుకోకుండా ఇప్పుడు జగన్‌పై నిందలేస్తున్నారని కొడాలి మండిపడ్డారు. ఆధారాలు లేవని కేసుని మూసేసే ఆలోచనలో ఉన్నట్టు ఉన్నారు అంటూ అధికార పక్షం మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసును ఇప్పటికే సీబీఐ విచారణకు అప్పగించినా వారు కూడా ఈ కేసు మీద పెద్దగా ఆసక్తి ఉన్నట్లు గా కనిపించడం లేదు.

వివేకా హత్య విషయంలో మొదటి నుండీ వైఎస్సార్ కాంగ్రెస్ విమర్శల పాలవుతుంది. రక్తం మడుగులో ఉన్న వివేకా మృతదేహాన్ని చూసి కూడా విజయ సాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చి గుండెపోటు తో మరణించడం దగ్గర నుండి… సీబీఐ విచారణ వద్దు అని ప్రభుత్వం హై కోర్టులో వాదించడం వరకు అన్నీ అనుమానాలకు రేకెత్తించేవిగానే ఉన్నాయి. అన్నింటి కంటే ఎక్కువగా వివేకా కుమార్తె ఇది ఇంటి దొంగల పనే అనడం అధికార పార్టీకి మరింత ఇబ్బందిగా మారింది.

ADVERTISEMENT
Latest Stories