శనివారం నాడు కలకలం రేపిన గాయని సుచిత్ర కార్తీక్ ట్వీట్లకు ‘క్లైమాక్స్’ ఎలా ఉంటుందోనని భావించిన వారికి ఊహించిన ట్విస్ట్ నే ఇచ్చింది సుచిత్ర. ఆదివారం మొదలుకుని మంగళవారం వరుసగా అనిరుద్, ఆండ్రియా, ధనుష్, అమలాపాల్, పార్వతినైర్ ల వీడియోలను పోస్ట్ చేస్తానని చెప్పిన సుచిత్ర ట్విట్టర్ అకౌంట్, ఆ తర్వాత మాయమైంది. అయితే ఈ ట్విట్టర్ ఖాతా క్లోజ్ అయిన తర్వాత కూడా ధనుష్ – త్రిషలకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేయడంతో ఎలాగైనా సదరు వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతాయని నెటిజన్లు భావించారు.
ఇదిలా ఉంటే… అసలు సుచిత్ర ట్విట్టర్ ఖాతాలో ఈ పోస్ట్ లన్నీ చేసింది ఆమేనా? అన్న ప్రశ్న మొదట్లోనే తలెత్తింది. దీనికి సమాధానం కూడా ఓ కోలీవుడ్ ప్రముఖ జర్నలిస్ట్ నుండి వ్యక్తమైంది. ఇప్పుడే సుచిత్రతో మాట్లాడానని, ఆమె అకౌంట్ హ్యాక్ కాలేదని, ఆ ట్వీట్లు అన్నీ చేస్తోందని సుచిత్ర మాత్రమేనని సోషల్ మీడియా ద్వారా తెలిసింది. అలాగే సుచిత్ర భర్త కూడా ఓ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో విడుదల చేసారు. సుచిత్ర మానసిక పరిస్థితి ప్రస్తుతం సరిగా లేదని, కావున ఆమె చేస్తున్న పనులకు క్షమించాలని, ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలని కోరారు. దీంతో సుచిత్రే స్వయంగా ఈ పోస్ట్ లన్నీ చేస్తోందన్న విషయం ఖరారైంది.
ఇది శనివారం నాటి ఉదయం విషయం. కానీ, సాయంత్రం సమయం అయిపోయేపాటికి కధ పూర్తిగా మారిపోయింది. ఓ మీడియా ఛానల్ తో మాట్లాడిన సుచిత్ర, “తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని, అందుకే తన అకౌంట్ ను రద్దు చేయాల్సిందిగా ట్విట్టర్ ఇండియాను పలుమార్లు కోరడంతో, తన అకౌంట్ డిలీట్ అయ్యిందని” వివరణ ఇచ్చింది. ఇందులో మరొక ట్విస్ట్ ఏమిటంటే… “ప్రస్తుతం అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్సకు వచ్చానని, త్వరలో తన భర్త కార్తీక్ కు విడాకులు ఇవ్వబోతున్నట్లుగా” చెప్పుకొచ్చింది.
సుచిత్ర బయట పెడతానన్న సెలబ్రిటీలు ప్రముఖ కుటుంబాలకు చెందిన వారు కావడంతో, ఖచ్చితంగా తెరవెనుక మంత్రాంగం రంగంలోకి దిగుతారని ముందుగా ఊహించిన విషయమే. అందుకు తగిన విధంగానే సాయంత్రం మీడియాకు వచ్చేపాటికి, సుచిత్ర తన అకౌంట్ హ్యాక్ అయ్యిందని వివరణ ఇచ్చుకున్నట్లుగా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయితే, ఫోన్ లోని ఫోటోలు, వీడియోలు ట్విట్టర్ లోకి ఎలా అప్ లోడ్ అయ్యాయి? అన్న చిన్న లాజిక్ ను సుచిత్ర మిస్ అయ్యింది అంటున్నారు నెటిజన్లు. తన మొబైల్ కూడా హ్యాక్ అయ్యింది అని చెప్తే… జవాబు కాస్త సంతృప్తిగా ఉండేదేమో..!



