మహేష్ బావ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ ?

Sudheer Movie With Puri Jagganadhప్రిన్స్ ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు, ఇటీవల ‘భాఘీ’ చిత్రం ద్వారా విలన్ గా మారారు. ఈ సినిమాలో కనపరిచిన అభినయానికి గానూ సుధీర్ బాబుకు మంచి పేరు ప్రఖ్యాతలు లభించాయి. ముఖ్యంగా సుధీర్ శారీరక ధారుడ్యం చూసి బాలీవుడ్ సినీ జనాలే నోరెళ్ళబెట్టారు. అలాంటి సుధీర్ బాబుకు తాజాగా టాలీవుడ్ లో బంపర్ ఆఫర్ లభించిందన్న టాక్ ఊపందుకుంది. అయితే ఇది కూడా విలన్ పాత్ర కావడం విశేషం.

ఇటీవలే లాంచనంగా ప్రారంభం జరుపుకున్న పూరీ – బాలకృష్ణల సినిమాలో సుధీర్ బాబును విలన్ గా ఎంపిక చేసినట్లు ట్రేడ్ వర్గాలలో ఓ సమాచారం హల్చల్ చేస్తోంది. ఇందులో ఎంత వాస్తవముందో రానున్న రోజుల్లో తేలనుంది గానీ, ఇది గనుక నిజమైతే సుధీర్ కెరీర్ మరో మలుపు తిరిగినట్లే చెప్పవచ్చు. ఎందుకంటే పూరీ సృష్టించే విలన్ పాత్రలు ఒక్కోసారి హీరోను కూడా డామినేట్ చేసే విధంగా ఉంటాయి కాబట్టి!

ADVERTISEMENT

‘ఏక్ నిరంజన్’ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ప్రత్యర్ధిగా సోనూ సూద్ క్యారెక్టర్ సినిమాకే హైలైట్ అయ్యింది. ఒక విధంగా ఆ సినిమాలో విలనిజంతో పాటు కామెడీ పండించిన క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే అది సోనూ సూద్ ది మాత్రమే. ఇలాంటి క్యారెక్టర్ లాంటిదే తగిలితే, ఒక ఆర్టిస్ట్ కు అంతకు మించి కావాల్సింది ఏముంటుంది? మరి బాలీవుడ్ ప్రేక్షకులకు తన విలనిజంను చూపించిన సుధీర్, టాలీవుడ్ జనాలకు కూడా చూపిస్తాడో లేదో మరికొద్ది రోజుల్లో తేలనుంది.

ADVERTISEMENT
Latest Stories