‘జబర్దస్త్’ రష్మితో ఎఫైర్లంటూ ఎప్పుడూ వార్తల్లో ఉండే సుడిగాలి సుధీర్, ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. అయితే పెళ్లి చేసుకుని కాదు, కొత్త గృహం కొనుగోలు చేసి! ‘ఇల్లు కట్టి చూడు… పెళ్లి చేసి చూడు…’ అన్న సామెతలో సగాన్ని దిగ్విజయంగా పూర్తి చేసాడు సుధీర్. “నేనూ ఒక సొంత ఇల్లు కొనుక్కుని ఒక ఇంటి వాడినయ్యాను” అని సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నాడు.
ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా ‘జబర్దస్త్’ నిర్వాహకులైన మల్లెమాల ఎంటర్ టెయిన్ మెంట్స్, ఈ టీవీ తెలుగు, తెలుగు ఫిల్మ్మ్ ఇండస్ట్రీ (టీఎఫ్ఐ)తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు తన కృతజ్ఞతలు చెబుతున్నానని, వారి మద్దతు లేకపోతే తాను ఈ స్థాయికి వచ్చే వాడిని కాదని పేర్కొన్నాడు.
ADVERTISEMENT
ADVERTISEMENT



