అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదాలు – రష్మి!

anchor rashmi gautami bonding with vizag‘జబర్దస్త్’ సుధీర్ – రష్మి జంట బాగుంటుంది, పెళ్లిచేసుకోండి అంటూ ఓ అభిమాని చేసిన ట్వీట్ పై రష్మి ఫైర్ అయిన విషయం తెలిసిందే. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంపై ఇలాంటి సలహాలు, సూచనలు ఇవ్వవద్దంటూ చెప్పిన రష్మికి, ట్విట్టర్ వేదికగా మళ్ళీ మళ్ళీ అవే సందేశాలు వస్తుండడం విశేషం. అయితే తాజాగా ఓ అభిమాని మాత్రం ఆమెకు ఊరటనిచ్చే సందేశాన్ని ఇచ్చాడు.

‘డియర్ బ్రదర్ & సిస్టర్స్… ఒకవేళ మీరందరూ చెప్పినట్లు వాళ్ళు చేసుకుంటే, భవిష్యత్తులో గొడవలు వచ్చి విడిపోతే, అప్పుడు మీరు వెళ్లి కలుపుతారా? ఆమె ఒక మహిళ, తనకంటూ ఒక ఆలోచన ఉంటుంది, ఆమె మానాన ఆమెను బ్రతకనివ్వండి’ అంటూ ఓ ఫ్యాన్ చేసిన ట్వీట్ కు రిప్లై ఇచ్చిన రష్మి, ‘అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదాలు’ అంటూ తెలిపింది. సోషల్ మీడియా సెలబ్రిటీల జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో ఈ ఉదంతం చెప్పకనే చెప్తోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories