దటీజ్ సుకుమార్! లాజిక్ మిస్సవ్వడు!

Sukumar nannaku prematho audio launch speechసుకుమార్ దర్శకత్వం వహించిన సినిమాలు ఆయన కళా ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పాయి. చిన్న చిన్న అంశాలలో కూడా విమర్శలకు తావు లేకుండా ‘లాజిక్’లతో ‘మాజిక్’ చేయడం సుకుమార్ సొంతం. తను దర్శకత్వం వహించిన ‘1 నేనొక్కడినే’ సినిమాలోని తొలి ఫైట్ లో బైక్ వెళ్తున్నపుడు నీళ్ళు పైకి ఎగరకపోవడం.., లో బ్రిడ్జ్ నుండి వస్తున్న సమయంలో సెన్సార్డ్ లైట్స్ వెలగకపోవడం… వంటివి సుకుమార్ అద్వితీయ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి.

అలాంటి సుకుమార్ తన తండ్రిని గురించి చెప్తూ భావోద్వేగాలకు గురయ్యారు. “ఎవరికైనా ఇంట్లో అమ్మ, నాన్నల నుండి ఫోన్ వస్తే ముఖమంతా చిరాకు పెట్టి మాట్లాడతామని, అది దేవి, తారక్, నేను కూడా అలాగే మాట్లాడమని, అయితే అదే ఫ్రెండో, లవరో, భార్యో ఫోన్ చేస్తే చక్కగా నవ్వుతూ మాట్లాడతామని, అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ ఫ్రెండు, లవరు మనం ఎలా మాట్లాడితే అలా మాట్లాడతారని, మనం కోపంగా మాట్లాడితే వాళ్ళు కూడా కోపంగా మాట్లాడుతుంటారని, ప్రేమ చూపిస్తే ప్రేమగా ఉంటారని, అయితే మనం ఏం చూపించినా ప్రేమ చూపించేది ఒక్క అమ్మ, నాన్నలు మాత్రమేనని, అందుకే మనం అలా మాట్లాడతామని సుకుమార్ స్టైల్లో ఇచ్చిన ట్రీట్మెంట్ ఆడియన్స్ చేత చప్పట్లు కొట్టించింది.

ADVERTISEMENT

తిరుపతి వెళ్లి జుట్టు ఇచ్చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది కదా… అట్లాగే మనం తిట్టినా, కొట్టినా వాళ్ళ ప్రేమలో ఏ మార్పు రాదు, వాళ్ళ సామ్రాజ్యంలో మనమే కింగ్స్, మనమే రారాజులం! మన పిల్లల్ని మనం బాగా ప్రేమిస్తాం, కానీ మనల్ని నిస్వార్ధంగా ప్రేమించేది ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు.. వాళ్ళే అమ్మ, నాన్న అని సుకుమార్ చేసిన ప్రసంగం ఎమోషనల్ గా సాగింది. ఇక, సినిమా గురించి చెప్తూ… “తన తండ్రి జీవితమే” ఈ సినిమా కధ అని సుకుమార్ అభిప్రాయపడ్డారు.

ADVERTISEMENT
Latest Stories