సుకుమార్ తర్వాత సినిమా ప్రకటన వచ్చేసింది!

sukumar next movie with devi sri“నాన్నకు ప్రేమతో” సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వం వహించబోయే సినిమా ఏది? ఏ హీరో సుకుమార్ కు డేట్స్ ఇవ్వబోతున్నాడు? నిజానికి “1 నేనొక్కడినే” సినిమా ఫలితం తర్వాత కూడా ఇదే ప్రశ్నలు సుక్కు అభిమానులను, ట్రేడ్ వర్గాలను పలకరించాయి. ఓ ఆరు మాసాల వరకు ఖాళీగా ఉన్న సుకుమార్, అనేక ట్విస్ట్ ల మధ్య ఎన్టీఆర్ సినిమాను ప్రారంభించారు.

అయితే “నాన్నకు ప్రేమతో” సినిమా ఫలితం కూడా “1” సినిమా బాటలోనే పయనిస్తోంది. దీంతో సుకుమార్ లాజిక్ లు సగటు సినీ ప్రేక్షకుడికి అర్ధం కావడం అసాధ్యంగా కనపడుతున్న తరుణంలో… సుకుమార్ తదుపరి చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సుక్కు దీనికి జవాబిచ్చారు.

ADVERTISEMENT

“నాన్నకు ప్రేమతో” సినిమా ప్రమోషన్స్ ముగిసిపోయిన తర్వాత ఓ రెండు, మూడు నెలలు విశ్రాంతి తీసుకుంటానని, ఏప్రిల్ లో తదుపరి సినిమాపై ఫోకస్ చేస్తానని, దేవిశ్రీప్రసాద్ ను హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమా ఉండబోతుందని ప్రకటించారు. దీంతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా… సుకుమార్ సినిమాతో పాటు దేవిశ్రీ హీరోగా తెరంగ్రేటంపై స్పష్టత వచ్చేసింది. అయితే ఈ సారైనా ప్రేక్షకుల ఆలోచనలకు అందే లాజిక్స్ తో సుకుమార్ ఆడియన్స్ ముందుకు వస్తారేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories