‘నాని’ కోసం వెళితే ‘షాక్’ ఇస్తున్న మరో ‘హీరో’

sumanth-naruda-donaruda‘నాచురల్ స్టార్’ నాని హీరోగా తెరకెక్కిన ‘మజ్ను’ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. వరుస విజయాలతో మాంచి ఊపు మీదున్న నాని, ఈ సినిమాతో హిట్ అందుకుని ‘డబుల్ హ్యాట్రిక్’కు శ్రీకారం చుడతారన్న టాక్ ట్రేడ్ వర్గాల్లో ఉంది. మరి ఆ అంచనాలను నాని ఎంతవరకు అందుకుంటాడో గానీ, సోషల్ మీడియాలో ‘మజ్ను’ గురించి పాజిటివ్ టాక్ వ్యక్తమవుతోంది.

‘వన్ టైం వాచ్, టైం పాస్ మూవీ…’ అంటూ మజ్నుకు కితాబిస్తున్నారు నెటిజన్లు. అయితే నాని ‘మజ్ను’ కోసమని వెళ్ళిన వారికి ఇంటర్వెల్ బ్యాంగ్ లో మరో హీరో దర్శనమిచ్చి షాక్ ఇస్తున్నాడు. కానీ, ఇది ‘మజ్ను’ సినిమాకు సంబంధించి మాత్రం కాదు. నాని ‘మజ్ను’ సినిమా విడుదలైన ధియేటర్లలో ఇంటర్వెల్ సమయంలో సుమంత్ హీరోగా తెరకెక్కిన ‘నరుడా… డోనరుడా…’ ధియేటిరికల్ ట్రైలర్ ను ప్రదర్శిస్తున్నారు.

ADVERTISEMENT

ఊహించని ఈ ట్రైలర్ దర్శనమివ్వడంతో ఆసక్తిగా తిలకించిన వీక్షకులను సుమంత్ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ‘స్పెర్మ్’ను దానం చేసే వినూత్నమైన కధతో తెరకెక్కిన ‘నరుడా… డోనరుడా…’ సినిమా ట్రైలర్ బాగుందని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. బాలీవుడ్ సినిమా ‘వికీ డోనర్’కు రీమేక్ గా రూపుదిద్దుకున్న ఈ ట్రైలర్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉందని, ఖచ్చితంగా వినోదాన్ని పంచే సినిమా అవుతుందని సోషల్ మీడియాలో ‘నరుడా… డోనరుడా…’ ట్రైలర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories