సునీల్… ఇక ఆలోచించాలయ్యా..!

'Ungarala Rambabu' Has No Connection to Chiranjeevi's Movie - Sunilటాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా తన హవాను కొనసాగిస్తున్న సమయంలో ‘అందాల రాముడు’ ద్వారా హీరోగా అడుగుపెట్టిన సునీల్ కు రాజమౌళి “మర్యాద రామన్న” ద్వారా బిగ్గెస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ‘పూలరంగడు’ సినిమాతో పర్వాలేదనిపించగా, అప్పటినుండి ఇప్పటివరకు ‘హిట్’ అనే పదం సునీల్ ఖాతాలో పడలేదు. అంటే 2012 నుండి నిరంతరాయంగా ఏడాదికి ఒకటో, రెండో సినిమాలు చేస్తూనే ఉన్నాడు గానీ, ఫలితం మాత్రం శూన్యం.

తాజాగా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన “ఉంగరాల రాంబాబు” సినిమాకు కూడా ప్రేక్షకుల నుండి డివైడ్ టాక్ వెలువడిన నేపధ్యంలో… ఇక తను హీరోగా కొనసాగడంపై సునీల్ ఒకసారి పునరాలోచిస్తే… టాలీవుడ్ కు కమెడియన్ లేని లోటు పూడ్చినట్లే చెప్పవచ్చు. ఓ పక్కన ఎమ్మెస్ నారాయణ, ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి వారిని టాలీవుడ్ కోల్పోగా, మరో పక్కన బ్రహ్మి రొటీన్ కామెడీని తిరస్కరించడంతో, సరైన కమెడియన్ లేక తెలుగు సినీ పరిశ్రమ విలవిలలాడుతోంది.

ADVERTISEMENT

ఇంకో వైపు హీరోగా చేస్తున్న సునీల్ అయినా సక్సెస్ అవుతూ తెలుగు ప్రేక్షకులను నవ్విస్తున్నారా… అంటే ప్రయత్నాలు అయితే “భీమవరం బుల్లోడు, కృష్ణాష్టమి, ఈడు గోల్డ్ ఎహే, జక్కన్న” వంటి సినిమాల ద్వారా చేసాడు గానీ, ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయాడు. ఈ అపజయాల ఒరవడి అలా పెరుగుతూ పోతోంది తప్ప, అది సునీల్ కు అనుకూలంగా కూడా లేకపోవడం… ఇకపై అయినా సునీల్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదు… హీరోగా కొనసాగుతాను అనుకుంటే మాత్రం… అర్జెంటుగా ఓ బంపర్ హిట్ ను కొట్టాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories