సునీల్ అదృష్టం… 10 వేలకే ఫ్యాన్సీ నెంబర్..!

sunil Skoda car fancy number 2345మొబైల్, కారు… ఇలా వాటికి ఫ్యాన్సీ నంబర్లు ఉండాలని ఇష్టపడే వారిలో, ముఖ్యంగా సెలిబ్రిటీలు ముందు వరుసలో ఉంటారనడం అతిశయోక్తి కాదేమో! తమకు ఇష్టమైన లేదా కలిసొచ్చే నంబరు కోసం ఎంత మొత్తమైనా సరే, చెల్లించి ఆ నంబరును సొంతం చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ప్రముఖ నటుడు సునీల్ తన కారుకు ఫ్యాన్సీ నెంబర్ ను దక్కించుకున్నాడు.

40 లక్షల విలువ చేసే తన స్కోడా లూరిస్ వాహనం రిజిస్ట్రేషన్ కోసం మలక్ పేటలోని ఆర్టీఏ కార్యాలయానికి సోమవారం నాడు సునీల్ విచ్చేసారు. టీఎస్ 11ఇజే 2345 నెంబరు కోసం పదివేల రూపాయల విలువ చేసే డీడీని సునీల్ తమకు ఇచ్చాడని కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. సాధారణంగా ఈ నెంబర్ కోసం పోటీ విపరీతంగా ఉంటుంది గానీ, సునీల్ అదృష్టమేమో గానీ, కేవలం 10 వేలకే ఫ్యాన్సీ నెంబర్ కొట్టేసాడు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories