సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు నాడు తన సినిమాలకు సంబంధించిన వాటిని పోస్ట్ చేయడం ‘దూకుడు’ నుండి మహేష్ కు ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సారి పోస్ట్ చేయడానికి ప్రత్యేకంగా ఏమీ లేవు, కొత్త సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు, ‘భరత్ అనే నేను’ సంగతి తెలిసిందే. దీంతో ఈ బాధ్యతలను ఈ సారి సుధీర్ బాబు అందిపుచ్చుకున్నట్లుగా కనపడుతోంది.
జూన్ 15వ తేదీన విడుదలకు సిద్ధమైన సుధీర్ బాబు తాజా చిత్రం “సమ్మోహనం” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ను సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ను 31వ తేదీన ఉదయం 9.18 నిముషాలకు విడుదల చేయబోతున్నారు. ఏది ఏమైతేనేం బావమరిది బాధ్యతలను బావ అందిపుచ్చుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం.
ADVERTISEMENT
ADVERTISEMENT



