కలకలం రేపుతున్న సుష్మాస్వరాజ్ ట్వీట్!

Sushma Swaraj Kidney Failure  Kidney Transplant Dialysis Admitted AIIMS Hospitalకేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నేడు ఉదయం ఇచ్చిన ట్వీట్ సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. “తన కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, డయాలిసిస్ కోసం ఎయిమ్స్ కు వెళ్తున్నానని, కిడ్నీ మార్పిడి కోసం టెస్టులు కూడా జరుగుతున్నాయని, శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు ఉంటాయని” చేసిన ట్వీట్ బిజెపి వర్గాల్లో, సుష్మా అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది.

ADVERTISEMENT

ఇప్పటివరకు బయటపెట్టని విషయాన్ని సుష్మా వెల్లడించడంతో, పరిస్థితి ఎలా ఉందోనంటూ పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా డయాలిసిస్ కు వెళ్ళాలి అంటే… రెండు కిడ్నీలు విఫలమైతే తప్ప వైద్యులు సూచన చేయని పరిస్థితి. అందులోనూ డయాలిసిస్ అనేది ఒక్కసారి ప్రారంభమైతే… అది జీవితకాలం కొనసాగుతూనే ఉండాలి. దీంతో సుష్మా ఆరోగ్యంగా ఉండాలని అభిమానులు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా అభిలషిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories