మెగాస్టార్ ‘సైరా నరసింహారెడ్డి’ లేటెస్ట్ అప్ డేట్స్!

sye-raa-narasimha-reddy-motion-poster-Youtube viewsమెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం “సైరా నరసింహారెడ్డి” సినిమాకు అత్యున్నత సాంకేతిక నిపుణులను ఎంపిక చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ సినిమాకు సంగీతాన్ని ఇచ్చే బాధ్యతను ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ను అందించారు. ఇప్పటికే చిత్ర‌ యూనిట్‌తో రెండు మూడు సార్లు స‌మావేశ‌మైన‌ రెహమాన్, స్వ‌రాలను స‌మ‌కూర్చే ప‌నిలో నిమ‌గ్న‌మైన‌ట్లుగా తెలుస్తోంది.

ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ పీరియాడిక్ చిత్రంలో ప్ర‌తి ఒక్క పాట మెగా అభిమానుల‌కు న‌చ్చే విధంగా ఉండేలా నిర్మాత రామ్ చ‌ర‌ణ్ పలు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. అలాగే బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ కూడా పీరియాడిక్ స‌మ‌యానికి ద‌గ్గ‌ర‌గా ఉండ‌నుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబ‌ర్‌ లో ప్రారంభం కానుంది.

ADVERTISEMENT

మనదేశంలో వివిధ భాష‌ల్లో నిర్మాణం జరుపుకోబోతున్న ఈ చిత్రంలో ఆయా భాష‌ల‌కు సంబంధించిన న‌టీన‌టులు ఉండేలా చిత్ర‌ యూనిట్ జాగ్ర‌త్త‌లు తీసుకుంది. ఇందులో అమితాబ్ బ‌చ్చ‌న్ ఉయ్యాల‌వాడ పెద్ద‌మ‌ల్లారెడ్డిగా న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. అలాగే న‌య‌న‌తార‌, ప్ర‌జ్ఞా జైశ్వాల్‌, జ‌గ‌ప‌తిబాబు, సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి, నాజ‌ర్‌, ముకేష్ రుషి, ర‌ఘుబాబు, సుబ్బ‌రాజు తదితరులు కీల‌క పాత్ర‌లు పోషించ‌నున్నారు.

ADVERTISEMENT
Latest Stories