మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన “సైరా నరసింహారెడ్డి” మోషన్ పిక్చర్ ఏ విధంగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి అంతలా ఆకర్షించిన ఈ మోషన్ పిక్చర్ కు యూ ట్యూబ్ లో ఎలాంటి స్పందన వచ్చింది? ‘ఖైదీ నంబర్ 150’ టీజర్ అద్వితీయమైన రికార్డులను సాధించడంతో, దానిని మించిపోయేలా ఈ మోషన్ పిక్చర్ ఉంటుందని మెగా అభిమానులతో సహా అంతా భావించారు. కానీ వాస్తవానికి అందుకు విరుద్ధంగా జరగడం విశేషం.
దాదాపుగా 24 గంటలు గడిచే సమయానికి ‘సైరా నరసింహారెడ్డి’ మోషన్ పిక్చర్ కు కేవలం 1.3 మిలియన్ క్లిక్స్ రావడం ఆశ్చర్యానికి గురి చేసే అంశంగా మారింది. ఇటీవల కాలంలో చిన్న చిన్న సినిమాలకు కూడా మొదటి రోజులో 2, 3 మిలియన్ క్లిక్స్ ను అందుకుంటున్న తరుణంలో… మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా విడుదలైన మోషన్ పిక్చర్ కు ఈ మాత్రం స్పందనేనా..? అనిపించక మానదు. బహుశా ‘మోషన్ పిక్చర్’ అని మెగా అభిమానులు లైట్ గా తీసుకున్నారేమో..!


