సైరా… చిరు లుక్ సూపర్ రా..!

Sye Raa Narasimha Reddy Movie Teaser Talkమెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న “సైరా నరసింహారెడ్డి” ఫస్ట్ టీజర్ విడుదలైంది. 1800 దశకాల్లో బ్రిటిష్ వారికి ఎదురుతిరిగిన మొదటి స్వాతంత్ర్య సమరయోధుడి పాత్ర అయిన ‘సైరా నరసింహారెడ్డి’ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్ అదిరిపోయింది. దర్శకుడిగా సురేందర్ రెడ్డి టేకింగ్ మెగాస్టార్ ను బాగా ఎలివేట్ చేసాయి.

ADVERTISEMENT

[m9ad]

ముఖ్యంగా కోట మీద చిరు నిల్చున్న షాట్… గుర్రం మీద నుండి వస్తున్న షాట్… మెగా ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ గా పేర్కొనవచ్చు. అలాగే బ్రిటిష్ కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబించడంలో కొణిదెల ప్రొడక్షన్స్ వాల్యూస్ ప్రతి షాట్ లో కనపడుతోంది. చిరు పుట్టినరోజుకు అభిమానులకు అందించిన పర్ ఫెక్ట్ గిఫ్ట్ గా ఈ టీజర్ నిలుస్తోంది.

అయితే ఇందులో నెగటివ్స్ కూడా లేకపోలేదు. ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేసిన సమయంలో ఎస్.ఎస్.థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్ లో మచ్చుకైనా కనిపించలేదు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులకు కావాల్సిన ఊపునైతే ఇవ్వలేదు.

ADVERTISEMENT
Latest Stories