పవన్ పేరు పలికాడు… రామ్ చరణ్ ఎంజాయ్ చేసాడు..!

sye raa narasimha reddy - Ram Charanఇటీవల కాలంలో మెగా హీరోల వేడుకలలో పవన్ కళ్యాణ్ నామస్మరణ బాగా తగ్గిపోయిందనే చెప్పాలి. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ సినీ వేడుకలపై పూర్తిగా లేకపోగా, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ సినీ వేడుకలపై మాత్రం వినిపిస్తోంది. అయితే మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా మోషన్ పిక్చర్ ప్రారంభ వేడుకపై అనుకోకుండా ‘పవన్ కళ్యాణ్’ పేరు ప్రస్తావనకు రావడంతో, ఫ్యాన్స్ తమ ప్రతాపం చూపించారు.

‘సైరా నరసింహారెడ్డి’ కధ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ… చిరంజీవి గారంటే చాలా ఇష్టం మాకు, ఇన్నాళ్ళ తమ బంధంలో చిన్న పోరాపత్యాలు కూడా రాలేదు, నాగబాబు గారి నవ్వంటే మహా ప్రాణం మాకు, ఒక్క సినిమాకు రాయకపోయినా పవన్ కళ్యాణ్ అన్నా ప్రాణమే మాకు… ఇక ఇక్కడితో బ్రేక్ పడింది… అక్కడ నుండి కాసేపటి వరకు అభిమానుల ఈలలు, కేరింతలే..!

ADVERTISEMENT

అభిమానుల హంగామాను చూసి రామ్ చరణ్ చిరునవ్వులు చిందించగా, అల్లు అరవింద్ తదేకంగా చూస్తూ ఉండిపోయారు. చాలాకాలం తర్వాత చిరు వేడుకలో పవన్ పేరు వినిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ తర్వాత తనదైన శైలిలో ప్రసంగాన్ని కొనసాగిస్తూ… మెగా కాంపౌండ్ వారసుల గురించి, చిత్ర యూనిట్ సభ్యుల గురించి మాట్లాడి ముగించారు. అయితే పవన్ పేరుకు వచ్చినంత స్పందన ఎక్కడా రాలేదందోయ్!

ADVERTISEMENT
Latest Stories