సైరా.. ఇదే అసలు రేట్ అట

Sye Raa Narasimha Reddyమెగాస్టార్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సైరా’ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో ఒకేరోజు విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. మొన్న ఆ మధ్య సినిమా టీవీ హక్కుల గురించి ఒక వార్త వచ్చింది.

ADVERTISEMENT

జీ నెట్వర్క్ సినిమాకు సంబంధించిన నాలుగు భాషల హక్కులను 125 కోట్లకు దక్కించుకుందట. తాజాగా అదంతా అబద్దం అని తేలింది. ఈ సినిమా టీవీ హక్కులు సన్ నెట్వర్క్ దక్కించుకుందట. అది కూడా తెలుగు, తమిళ, మలయాళం వెర్షన్లు కేవలం 25 కోట్లు చెల్లించిందట. హిందీ టీవీ హక్కులు ఇంకా అమ్మాల్సి ఉంది.

అమెజాన్ ప్రైమ్ ఇప్పటికే అన్ని భాషల డిజిటల్ రైట్స్ దక్కించుకుంది. 125 కోట్ల వార్తను హైప్ కోసం నిర్మాతలే లీక్ చేశారా మీడియాకు అనే అనుమానాలు ఉన్నాయి. సైరా ప్రీ-రిలీజ్ ఈవెంట్ రేపు హైదరాబాద్ లో ఘనంగా జరగబోతుంది. చిత్రం లోని పాటలు కూడా అదే వేదిక మీద నుండి విడుదల అయ్యే అవకాశం ఉందట.

దేశంకోసం పోరాడిన ఒక వీరుడి గాధను దేశవ్యాప్తంగా పరిచయం చెయ్యాలని చిరంజీవి ఆశపడుతున్నారు. అందుకే దేశవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. హిందీ లో కూడా సినిమాకు డీసెంట్ బజ్ ఉందని నిర్మాతల అభిప్రాయం. చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్ర చెయ్యడం తమకు కలిసి వస్తుందని చిత్రబృందం ఆశిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories