సైరా విషయంలో అది రాంగ్ స్టెపా?

Sye Raa Narasimha Reddy - trailer release at SIIMA  in Qatartమెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘సైరా’ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ కు సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని తెలుగుతో పాటు వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు..ఖతార్ లోని దోహా వేదికగా వచ్చే నెల 15 మరియు 16 తేదీలలో జరగనున్న సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా)వేదికపై ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేయనున్నారని సమాచారం.

ADVERTISEMENT

హిందీతో పాటు సౌత్ లోని పలు భాషలలో విడుదల కానున్న సైరా మూవీ ట్రైలర్ ని అక్కడ విడుదల చెయ్యబోవడం కరెక్టు స్టెపా కదా అనేదాని మీద చర్చ జరుగుతుంది. సైమా అనేది ప్రతి సంవత్సరం హంగామాగా చేసినా ఆడియన్స్ లో పెద్దగా పాపులర్ కాదు. దానికి తోడు ఈ ఈవెంట్ లైవ్ టెలికాస్ట్ ఉండదు. కొన్ని రోజుల తరువాత టీవీలో రికార్డు చేసి వేస్తారు. దీనివల్ల రావాల్సిన హైప్ రాదు. దీనికంటే మరో విధంగా ట్రైలర్ రిలీజ్ చేస్తే బావుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మాతగా ,దర్శకుడు సురేందర్ రెడ్డి రూపొందిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతిబాబు, విజయ సేతుపతి, అమితాబ్, తమన్నా వంటి స్టార్ కాస్ట్ ఇతర ముఖ్యపాత్రాలలో నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ సినిమాలో నటించడం వల్ల సినిమాకు ఉత్తరాదిన కూడా హైప్ వస్తుందని మెగా కుటుంబం ఆశాభావంగా ఉంది. చూడాలి ఏం జరగబోతుందో!

ADVERTISEMENT
Latest Stories