తమన్నా… తెల్లగా ఉన్నావని పొగరా..!

Tamannaah Bhatia Cancelled Lakme Fashion Week at The Last Minute ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేయడం ఎంతటి సెలబ్రిటీకైనా చాలా సాధారణమైన విషయంగా మారిపోయింది. ఆ క్రమంలోనే ‘మిల్కీ బ్యూటీ’ తమన్నా తన ఫ్యాన్స్ తో ముచ్చటించే కార్యక్రమం పెట్టుకుంది. మరి ‘మిల్కీ బ్యూటీ’తో చిట్ చాట్ అంటే ఫ్యాన్స్ కు పండగే కదా! అలా ప్రశ్నలకు బదులిస్తున్న క్రమంలో… తన ప్రశ్నలకు తమన్నా స్పందించకపోవడంతో… ఓ అభిమాని తీవ్రంగా స్పందిస్తూ… ‘తెల్లగా ఉన్నావని పొగరా… రిప్లై ఇవ్వట్లేదు…’ అంటూ సూటిగా ప్రశ్నించాడు.

దీంతో “పొగరు లేదండి… దండాలు అనే ఎమోజీలను పెడుతూ, మీ జీవితానికి ఆల్ ది బెస్ట్…” వినమ్రంగా చెప్పింది తమన్నా. ఈ సందర్భంగా వచ్చిన అనేక ప్రశ్నలలో భాగంగా… ప్రస్తుతం తాను చాలా తెలుగు సినిమా చేస్తున్నానని, నిజానికి తెలుగు మాట్లాడడం కూడా నేర్చుకున్నానని, ఇంకా బాగా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపింది. పవన్ కళ్యాణ్ అంటే చాలా గౌరవం ఉందని, మహేష్ బాబు చాలా ఆకర్షణీయంగా ఉంటారని, విజయ్ నటిస్తున్న “మెర్సల్” సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నానని తెలిపింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories