ట్రైలర్ టాక్ – ప్రేక్షకుల సహనానికి పరీక్ష!

Tarun-Idi-Naa-Love-Story-Movie-Theatrical-TRAILERఫేడ్ అవుట్ అయిన యంగ్ హీరోలలో తరుణ్ పేరు బహుశా ఈ యువతరానికి గుర్తుందో లేదో గానీ, మరోసారి “ఇది నా లవ్ స్టోరీ” అంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గతేడాది తరుణ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను విడుదల చేయగా, ఈ ఏడాది మళ్ళీ తరుణ్ పుట్టినరోజు సందర్భంగా ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ లో ముఖ్యమైన అంశం ఏమిటంటే… ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14వ తేదీగా ప్రకటించారు.

దీంతో ఈ సినిమా విడుదల అవుతుందన్న సమాచారం ప్రేక్షకులకు చేరినట్లయ్యింది. తరుణ్ సరసన ఒవియా హెలెన్ నటించిన ఈ ట్రైలర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. రెండు నిముషాల పాటు సాగిన ఈ ట్రైలర్ లో తొలి 30 సెకన్లు గడిచే సమయానికి ఎప్పుడు ట్రైలర్ అయిపోతుందా అంటూ వేచిచూడడం వీక్షకుల వంతవుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే విధంగా ఈ ట్రైలర్ ను కట్ చేసారని చెప్పొచ్చు. తరుణ్ కంబ్యాక్ మూవీగా భావిస్తున్న ఈ సినిమా, ట్రైలర్ మాదిరి ఉండకూడదని ఆశిద్దాం.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories