టిడిపి మూడో జాబితా వచ్చేసింది… మరి కొన్నే పెండింగ్!

TDP

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టిడిపి మూడో జాబితా వచ్చేసింది. టిడిపి, జనసేన, బీజేపీల కూటమిలో భాగంగా టిడిపి 114 ఎమ్మెల్యే, 17 ఎంపీ స్థానాలకు పోటీ చేయబోతోంది. వాటిలో ఇప్పటికే 128 స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్ధులను ప్రకటించింది. తాజాగా మరో 11 మంది ఎమ్మెల్యేలతో పాటు ఒకేసారి 13 ఎంపీ అభ్యర్ధులను కూడా ప్రకటించింది. కనుక మరో 5 ఎమ్మెల్యే, 4 ఎంపీ అభ్యర్ధులను ప్రకటిస్తే టిడిపి జాబితా పూర్తయిపోయిన్నట్లే.

ADVERTISEMENT

ఈసారి మైలవరం టికెట్‌ మాజీ మంత్రి, సీనియర్ నేత దేవినేని ఉమాకి బదులు వైసీపిలో నుంచి వచ్చి కొత్తగా చేరిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌కు కేటాయించడం విశేషం. దీనిపై దేవినేని ఇంకా స్పందించాల్సి ఉంది.

అయితే విశాఖ ఎంపీ సీటుని బీజేపీకి విడిచిపెట్టిన్నట్లు ఊహాగానాలు వినిపించినప్పటికీ ఆ సీటుకి టిడిపి అభ్యర్ధిగా మత్తుకుమిల్లి భరత్ పేరుని ప్రకటించడంతో పూర్తి స్పష్టత వచ్చింది.

టిడిపి ఎంపీ అభ్యర్ధులు వీరే:

1. శ్రీకాకుళం: కింజారపు అచ్చన్నాయుడు

2. విశాఖపట్నం: మత్తుకుమిల్లి భరత్

3. అమలాపురం: గంటి హరీష్

4. ఏలూరు: పుట్టా మహేష్‌ యాదవ్‌

5. విజయవాడ: కేశినేని శివనాథ్ (చిన్ని)

6. గుంటూరు: పెమ్మసాని చంద్రశేఖర్

7. నరసారావుపేట: లావు శ్రీ కృష్ణదేవరాయలు

8. బాపట్ల: టి.కృష్ణ ప్రసాద్

9. నెల్లూరు: వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

10. చిత్తూరు: దగ్గుమళ్ళ ప్రసాద రావు

11. నద్యాల: బైరెడ్డి శబరి

12. హిందూపురం: బికె పార్ధసారధి.

టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధులు వీరే:

1. పాతపట్నం: మామిడి గోవిందరావు

2. పలాస: గౌతు శిరీష

3. శ్రీకాకుళం: గొండు శంకర్

4. యస్.కోట: కోళ్ళ లలిత కుమారి

5. కాకినాడ సిటీ: వనమాది వేంకటేశ్వర రావు (కొండ బాబు)

6. అమలాపురం: అయితాబత్తుల ఆనందరావు

7. పెనమలూరు: బోడే ప్రసాద్

8. మైలవరం: వసంత వెంకట కృష్ణ ప్రసాద్

9. నరసారావుపేట: చదలవాడ అరవింద బాబు

10. చీరాల” మద్దులూరి మాలకొండయ్య యాదవ్‌

11. సర్వేపల్లి: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

ADVERTISEMENT
Latest Stories