ఆ 18 కోట్లు ఎక్కడివి? చిక్కుల్లో టిడిపి ఎమ్మెల్యే!

tdp-mla-rajendar-reddy-18-crores-IT-Raidsతెలంగాణా గట్టుపై “ఆపరేషన్ ఆకర్ష్” అమలులో ఉన్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీలోకి తెలుగుదేశం, కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా ‘క్యూ’లు కడుతున్న విషయం తెలిసిందే. అయితే అధికార పార్టీ టార్గెట్ చేసిన నేతలు లొంగని పక్షంలో వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్న వార్తలు కూడా రాజకీయ వర్గాల్లో బలంగా ఉన్నాయి. ఇందుకు తాజా ఉదాహరణగా నారాయణపేట ఎమ్మెల్యే ఉదంతాన్ని చెప్తున్నారు.

బుధవారం రాత్రి ఐటీ దాడుల్లో నారాయణ పేట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన 50 ఏళ్ల రాజేందర్ రెడ్డి నుండి దాదాపు 18 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పలు కీలక పత్రాలను కూడా సొంతం చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా వాస్తవ్యుడైన రాజేందర్ రెడ్డి నవోదయ ఎడ్యుకేషన్ ట్రస్టుతో పాటు మెడికల్, డెంటల్, ఇంజనీరింగ్‌ కాలేజీలకు ఆయన ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో కంటే ఈయన సొంత ఆస్తులు కర్ణాటకలోని రాయ్‌చూర్‌‌లో ఎక్కువగా వున్నాయని తెలుస్తోంది.

ADVERTISEMENT

ఇటీవల ఆయన అక్కడ ఎం.ఫార్మసీ కాలేజీని నిర్మించారు. ఈ క్రమంలో ఆయన లావాదేవీలపై నిఘా పెట్టిన ఐటీ అధికారులు… కర్నాటకలోని రాయ్‌చూర్, గుల్బర్గా, బెంగళూరు, తెలంగాణ‌లోని మహబూబ్‌నగర్, హైదరాబాద్ ప్రాంతాల్లో దాదాపు 30 మంది అధికారులతో ఏక కాలంలో ఈ దాడులు చేసినట్టు తెలుస్తోంది. 2014లో జరిగిన ఎన్నికల అఫిడవిట్‌లో రాజేందర్ తన ఆస్తులను 29 కోట్ల రూపాయలుగా ప్రస్తావించారు. అప్పటి నుండి ఏ విధమైన పన్నులను చెల్లించకపోవడంతో ఈ దాడులకు పాల్పడినట్లుగా అధికార వర్గాల సమాచారం.

మరి ఇవి రాజకీయ కక్ష సాధింపు చర్యలో, రాజేందర్ రెడ్డి పన్నుల ఎగవేత సందర్భంగా చేసిన దాడులో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతానికైతే ఆ 18 కోట్లు లెక్కలు చెప్పుకునే పనిలో సదరు ఎమ్మెల్యే నిమగ్నమైనట్లుగా తెలుస్తోంది.

ADVERTISEMENT
Latest Stories