త్వరలో జరుగబోయే ఏపీ శాసనసభ ఎన్నికలలో వైసీపి 175కి 175 సీట్లు గెలుచుకుంటుందని జగన్ గొప్పగా చెప్పుకుంటున్నారు. టిడిపి, జనసేన, బీజేపీల కూటమి 175కి 160 సీట్లు తప్పకుండా గెలుచుకుంటుందని చంద్రబాబు నాయుడు నమ్మకంగా చెపుతున్నారు. కనుక రెంటికీ పూర్తి మెజార్టీ వస్తుందనే నమ్మకం ఉందని అర్దమవుతోంది. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే వారి అంచనాలు నిజమయ్యే అవకాశం లేదనిపిస్తుంది. అందుకు కొన్ని బలమైన కారణాలు కనిపిస్తున్నాయి.
1. వైసీపి-కూటమిలో చాలా బలమైన అభ్యర్ధులు ఉండటం వలన రెంటికీ మద్య గట్టి పోటీ జరుగుతుంది. కనుక రెంటికీ 50:50 నిష్పత్తిలో ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది.
2. హటాత్తుగా వైఎస్ షర్మిల ఊడిపడటంతో ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్దం అవుతోంది. ఆమె కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోలేనప్పటికీ, టిడిపి, జనసేన, బీజేపీ, వైసీపి నాలుగు పార్టీల ఓట్లు చీల్చి అన్నిటికీ నష్టం
కలిగించే అవకాశం ఉంటుంది.
3. ప్రజలలో నెలకొన్న వ్యతిరేకత, ఫిరాయింపుల కారణంగా ఈసారి వైసీపి చాలా సీట్లు కోల్పోయే అవకాశం కనిపిస్తోంది.
4. అలాగే వైసీపి, కాంగ్రెస్ పార్టీల వలన, ఇంకా అనేక ఇతర కారణాల వలన టిడిపి, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కూడా కొన్ని సీట్లు నష్టపోయే అవకాశం ఉంది.
కనుక ఇటు వైసీపికి అటు కూటమికి పూర్తి మెజార్టీ రాకపోయినా, కొద్దిపాటి మెజార్టీతో అధికారంలోకి వచ్చినా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, బిఆర్ఎస్ పార్టీల పరిస్థితే ఎదురవుతుంది. ఫిరాయింపులు మొదలైతే టైటానిక్ షిప్పులా మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక ఇటు వైసీపి, అటు టిడిపి, జనసేన, బీజేపీల కూటమికి పూర్తి మెజార్టీ తప్పనిసరి.




