Attacks On Kodali Nani House

ఐదేళ్ల తాత్కాలిక అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ, సామజిక విలువలను గాలికొదిలి కనీసం మహిళలు అనే సంస్కారం కూడా లేకుండా చేసిన వైసీపీ నీచ రాజకీయానికి ఏపీ ఓటర్లు స్వస్తి పలికారు.

అయితే అధికారం ఉన్న ఐదేళ్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని ఆయన కుటుంబాన్ని, టీడీపీ కార్యకర్త మొదలుకుని ఆ పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్కరిని మానసికంగా ఆర్థికంగా వేధించిన ఒక్కో వైసీపీ నేతకు తిరిగి సమాధానము చెప్పడానికి సిద్ధమయ్యారు టీడీపీ శ్రేణులు.

Also Read – బాక్సాఫీస్ ముంగిట “దేవర” డ్యాన్స్ వేయాల్సిందే!

మా కార్యకర్తలకు బీపీ లు వస్తే పార్టీ కార్యలయాలైన కూల్చేస్తారు, పార్టీ అధినేత ఇంటి పైకైనా దాడికి వస్తారు, ఎవరినైనా బూతులు తిడతారు అంటూ వైసీపీ నేతల విధ్వంసాన్ని ముఖ్యమంత్రి హోదాలో దగ్గరుండి ప్రోత్సహించారు వైస్ జగన్. “పసుపు జెండా పట్టుకున్నా, పసుపు చీర కట్టుకున్నా” క్షమించేది లేదు అన్నట్టుగా సొంత చెల్లిని సైతం వేధించారు జగన్.

అయితే రాష్ట్ర ముఖ్యమంత్రే తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాడులకు ఊతమిచ్చి అరాచకాలకు అంకురార్పణ చేసి ప్రతిపక్ష నాయకులను, వారి పార్టీ కార్యకర్తలను అణిచివేస్తే దాని పాలిట విస్ఫోటనం ఎలా ఉంటుందో ఇప్పుడు అనుభవిస్తున్నారు వైసీపీ మాజీ బూతుల మంత్రులు.

Also Read – అన్నకు సాకులే అస్త్రాలు…చెల్లికి ప్రశ్నలే ఆయుధాలు..!

నిండు సభలో చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని ఉద్దేశించి వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలకు కడుపు మండిన టీడీపీ మద్దతుదారులు వారి ఐదేళ్ల ఆవేదనకు వంశీ బదులు చెప్పాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు. జగన్ అండ చూసుకుని రెచ్చిపోయిన వంశీ ఇంటి మీద దాడికి ప్రయత్నించారు గన్నవరం టీడీపీ కార్యకర్తలు.

అలాగే కొడాలి నాని కూడా తన ఐదేళ్ల పిచ్చి ప్రేలాపనకు సమాధానం చెప్పి తీరాల్సిందే అంటూ నాని ఇంటి ముందు కూడా ఆందోళనకు దిగారు టీడీపీ శ్రేణులు. గుడివాడలో తానూ ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ఎన్నికల ప్రచారంలో విర్రవీగిన కొడాలి నాని తన మాట నిలబెట్టుకోవాలంటూ నాని ఇంటి పై కోడిగుడ్లు విసురుతూ తమ నిరసన తెలియ చేసారు తెలుగు తమ్ముళ్లు.

Also Read – పులివెందుల మీద ‘ఉండి’కి ప్రేమా? ప్రతీకారమా?

అయితే టీడీపీ కూటమి గెలుపుతో వైసీపీ నేతల ఇళ్ల మీద దాడులకు తెగబడుతున్నారు టీడీపీ శ్రేణులు అంటూ అప్పుడే గగ్గోలు పెడుతున్నారు వైసీపీ అధినేత జగన్. టీడీపీ కార్యకర్తల నుండి తమ పార్టీ నేతలకు రక్షణ కల్పించాలంటూ సోషల్ మీడియాలో సందేశాలు ఇస్తున్నారు. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం ఈ ఐదేళ్లల్లో వైసీపీ నుంచి చాలా తీసుకున్నాం తిరిగి చేయాల్సిందే లేకపోతే వైసీపీ నాయకుల మాదిరి మారిపోతాం అంటూ బదులిస్తున్నారు.