సమాధానం చెప్పలేక దళిత కార్డు వాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్?

tdp-ysrcp-bjp-tirupathi-by-election-campaignతిరుపతిలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పర్యటన కొనసాగుతుంది. పార్లమెంట్ లో ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ కు 22 ఉత్సవ విగ్రహ ఎంపీలు ఉన్నారని, ఇంకో విగ్రహాన్ని పంపిస్తారా అంటూ లోకేష్ చేస్తున్న ప్రచారానికి అధికార పార్టీ గట్టిగానే ఉలిక్కిపడినట్టు ఉంది. ఇప్పటికే దేశం మొత్తం చెప్పుకునే మెజారిటీ వస్తుంది అనే దగ్గర నుండి సీఎం జగన్ ప్రచారానికి వచ్చే వరకు అయ్యింది.

తాజాగా తమ ఎంపీ అభ్యర్థిపై టీడీపీ, ఇతర ప్రతిపక్షాల స్పీడ్ ను తగ్గించే ప్రయత్నం చేస్తుంది వైఎస్సార్ కాంగ్రెస్. చంద్రబాబు, లోకేష్ పై డీజీపీకి వైసీపీ ఫిర్యాదు చేశారు. తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తిని కించపరుస్తూ బహిరంగ సభలలో వ్యాఖ్యలు చేస్తున్నారని… అలాగే సోషల్ మీడియాలో టీడీపీ పోస్టింగ్ పెట్టిందని ఫిర్యాదు చేశారు.

ADVERTISEMENT

ఈ విషయంగా చంద్రబాబు, లోకేష్ పై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని వైసీపీ నేతలు కోరారు. ఇక్కడ ఇంకో కొసమెరుపు ఏంటంటే ఇవే వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ మీద మాత్రం ఎటువంటి ఫిర్యాదు ఇవ్వకపోవడం. “తమ అభ్యర్థి పై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పలేక దళిత కార్డు వాడుతున్నారు,” అని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు.

సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గ ప్రసాద్ రావు మరణించడంతో తిరుపతి ఉపఎన్నిక అనివార్యమైంది. సహజంగా ఎవరైనా సిట్టింగ్ ఎంపీ మరణిస్తే ఆయన కుటుంబసభ్యులకు టికెట్ ఇవ్వడం పరిపాటి. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిని మార్చింది. జగన్ పాదయాత్ర సందర్భంగా ఆయనకు ఫీజియోథెరపిస్ట్ గా పనిచేసిన గురుమూర్తిని కేవలం విధేయత కారణంగా అభ్యర్థిని చేసారు.

ADVERTISEMENT
Latest Stories