
తాజాగా రోహిత్ శర్మ నేతృత్వం లో భారత్ విశ్వవిజేతలుగా నిలిచారు.అయితే, ఆ ఫైనల్ నెగ్గిన సందర్భాన రోహిత్,కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక కేవలం వన్ డే మరియు టెస్ట్ ఫార్మటు లో మాత్రమే వారు దర్శనమివ్వనున్నారు. ఆ ఫైనల్ తరువాత రోహిత్,కోహ్లీ ఆడుతున్న మొదటి సిరీస్ ఇదే కావటం, అభిమానుల్లో అంచనాలు తార స్థాయికి వెళ్లాయి.
పైగా,కొత్త కోచ్ గా గంభీర్ వచ్చాక, తన కోచింగ్ లో ఆడుతున్న మొదటి వన్ డే సిరీస్ కావటం,ఇలా అన్ని విషయాల్లోనూ అభిమానులకు ఊరట కలిగించే విశేషాలున్నాయి.పైగా,ఈ వన్ డే సిరీస్ కు ముందు జరిగిన టి-20 సిరీస్ లో గంభీర్ కొత్త పర్వం మొదలయిందని సంకేతాలు వచ్చాయి.
దానికి అనుగుణంగానే ఆ సిరీస్ లో జట్టు లో ఎన్నో ప్రయోగాలు జరిగాయి.కానీ,చివరికి ఆ ప్రయోగాలు సఫలమయ్యి,భారత జట్టు కు విజయాన్ని చేకూర్చాయి. అదే ఇప్పుడు చూస్తే,ఈ సిరీస్ లో కూడా ప్రయోగాలు చేసారు.కానీ అవి జట్టు కు బలాన్ని చేకూర్చనది కాక,ఒక రకంగా జట్టుని ఇబ్బందుల్లోకి నెట్టాయి.
గతేడాది ముగిసిన వరల్డ్ కప్ లో నెంబర్ 4 ,5 స్థానాల్లో ఉత్తమ ప్రదర్శన ను చూపిన అయర్,రాహుల్ ల ను బాటింగ్ ఆర్డర్ లో నెంబర్ 6 ,7 స్థానాలకు నిర్ణీతం చేసారు. పైగా, లెఫ్ట్-రైట్ కాంబినేషన్ అంటూ సుందర్ లాంటి లోయర్ ఆర్డర్ బాట్స్మన్ ను నెంబర్ 4 లో పంపారు.ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాలు టీం ను మరింత కష్టాల్లోకి నెట్టేశాయి.
ముగిసిన మూడు మ్యాచ్లలోను టాస్ ఒడి,తొలుత బౌలింగ్ చేసారు భారత జట్టు. తొలి ఇన్నింగ్స్ లో భారత ఆటగాళ్లు మూడు మ్యాచ్లలోను శ్రీలంక జట్టును బాగా కట్టడి చేసారు. మూడు మ్యాచ్ ల లో ఒక్కసారి కూడా శ్రీలంక జట్టు 250 కు పై బడి పరుగులు చేయలేకపోయారు.
అయితే చేసింగ్ లో కెప్టెన్ రోహిత్ ఒక్కడే ఒక మైదానం లో, మిగతా 10 మంది బ్యాటర్లు మరొక మైదానం లో ఆడారా అన్నట్టు, రోహిత్ మూడు మ్యాచ్ ల లోనూ 120 + స్ట్రైక్ రేట్ తో బాటింగ్ చేసాడు. రోహిత్ క్రీజ్ లో ఉన్నంత వరుకు,లంక బౌలర్లకు కంటి మీద కునుకు లేకుండా చేసాడు.
Also Read – మిస్టర్ ప్రెసిడెంట్ ట్రంప్: హ్యాండ్సప్
నిన్నటి మ్యాచ్ తో ప్రస్తుతం వన్ డే ల లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో క్రిస్ గాయాలే తో సమానంగా రెండవ స్థానం లో ఉన్నాడు. వారికి ముందు కేవలం షాహిద్ ఆఫ్రిది 351 సిక్సులతో 20 సిక్సర్లు అదనంగానున్నారు. కోహ్లీ,రాహుల్,అయ్యర్,గిల్ వంటి బాట్స్మన్ అంత చేతులెత్తేసిన చోట, రోహిత్ ఉన్నంతసేపు బౌండరీల పరంపర కొనసాగించాడు.
అయితే,లంక బౌలర్ లు ఒక అత్యుత్తమ స్థాయి ఆటతీరు కనబరిచారు. వారి మైన్ బౌలర్లు ఎవరు లేని చోట, టయర్-2 బౌలర్లు ఏకంగా ఇండియా వంటి జట్టు ను మూడు మ్యాచ్లలోను ఆల్ అవుట్ చేసారు. విశేషం ఏంటంటే, పడిన 30 వికెట్లతో 27 వికెట్లు స్పిన్నర్లే తీశారు. ఇది ప్రపంచ చరిత్ర లో నే తొలి సారి.కాగా, కింగ్ కోహ్లీ జరిగిన మూడు మ్యాచ్లలోను స్పిన్నర్ కె అవుట్ అవగా,మూడూ ఎల్.బి.డబ్ల్యు ఏ కావటం విశేషం,ఇలా జరగటం కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ జర్నీ లో నే తొలి సారి.
ఇక,కోచింగ్ సంగతికి వస్తే, భారత జట్టు వంటి ఉన్నత జట్టుకు కోచ్ అవ్వటం అంటే ఎంతో ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కోచ్ గా రోహిత్,విరాట్ వంటి దిగ్గజాలతో సింక్ అవ్వటానికి గంభీర్ కు కాస్త టైం కావాల్సిందే.ఒక్క సిరీస్ ఓటమికి ఆయనని దూషించలేము. పైగా,ఈ ఓటమి మనవాళ్ళకి జరిగిన తప్పులను సరిదిద్దుకునేందుకు ఒక చక్కని అవకాశం ఇచ్చిందని ఫాన్స్ గుర్తుచేసుకుంటున్నారు. భారత జట్టు శ్రీలంక మీద సిరీస్ ఓడి 27 సంవత్సరాలవుతుంది.
లంక జట్టుకు ఇదొక సరికొత్త చరిత్ర అనే చెప్పాలి.భారత ఆటగాళ్లు చేసిన తప్పులేంటో తెలుసుకుని, వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆ తప్పులు చేయకుండా ఉంటారని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.”ఒక రకంగా ఇదీ మన మంచికే” అనుకుంటున్నారు అభిమానులు. జట్టు అంత సమకూరి,శర్మ నేతృత్వం లో వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే దిశగా ప్రణాళికలు సిద్ధం చెయ్యాలంటూ కోరుకుంటున్నారు.