అంత హంగామా చేసి ఇలా చేస్తే ఎలా?

Tej-I-Love-You-Continues-To-Impressమెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన “తేజ్ ఐ లవ్ యూ” ఆడియో వేడుక మెగాస్టార్ సమక్షంలో ఎంతో అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రభావం సినిమా ఓపెనింగ్స్ కు ఉపయోగపడుతుందని భావిస్తున్న నేపధ్యంలో…. ఈ సినిమా విడుదల వాయిదా పడనుందనే టాక్ ఊపందుకుంది. నిజానికి ఈ సినిమాను ఈ నెలాఖరున విడుదల చేయాలని భావించారు.

జూన్ 29 రిలీజ్ టార్గెట్ పెట్టుకోగా, తాజా సమాచారం మేరకు మరో ఒకటి, రెండు వారాలు జాప్యం జరగొచ్చని ప్రచారం జరుగుతోంది. దీనిని చిత్ర యూనిట్ ఇంకా ఖండించలేదు, సమర్ధించలేదు. అయితే అతి త్వరలోనే వాయిదాపై అధికారిక ప్రకటన రానుందని మాత్రం ట్రేడ్ వర్గాల సమాచారం. చెప్పిన సమయానికి రిలీజ్ కాకపోతే సినీ ప్రేక్షకులలో అంత ఉత్సాహం కనిపించదు కదా!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories