రేవంత్ రెడ్డికి పొంచి ఉన్న మొదటి గండం

telangana congress pcc president revanth reddyరేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావడంతో తెలంగాణ కాంగ్రెస్ లో ఉత్సాహం వెల్లివిరుస్తుంది. రేవంత్ రాక కారణంగా పార్టీ క్యాడర్ లో నూతనోత్సాహం కనిపిస్తుంది. గతంలో కాంగ్రెస్ నుండి తెరాస, బీజేపీ పార్టీలలో చేరిన నేతలు పార్టీ భవిష్యత్తు మీద ఆశలతో తిరిగి కాంగ్రెస్ వైపుకు చూస్తున్నారు.

గతంలో టీడీపీలో రేవంత్ తో కలిసి పని చేసి వేరే పార్టీల లో ఉన్న నేతలు కూడా రేవంత్ వద్దకు చేరేందుకు ఆసక్తిగా ఉన్నారట. మొన్న ఆ మధ్య కాంగ్రెస్ కు రాజీనామా చేసిన చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఈరోజు రేవంత్ ని కలిసి అధ్యక్షుడు కావడం పై శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తిరిగి పార్టీలో చేరుతారనే ప్రచారం మొదలయ్యింది.

ADVERTISEMENT

పీసీసీ పదవి ఆశించి భంగపడ్డ సీనియర్లు మాత్రం ఇంకా రేవంత్ తో కలిసి పని చేసే ఉద్దేశంలో ఉన్నట్టు కనిపించడం లేదు. అయితే మునుముందు వారు కూడా దారిలో పడతారు అని పార్టీ నాయకత్వం ధీమాగా ఉంది. అయితే పరిస్థితులు కొంత అనుకూలంగా కనిపించినా రేవంత్ కు ఇంకో ప్రమాదం పొంచి ఉందనే చెప్పుకోవాలి.

హుజురాబాద్ ఉపఎన్నికల లో పార్టీ ఎలా రాణిస్తుంది అనే దాని మీద ఈ జోష్ నిలుస్తుందా లేదా అనేది తెలుస్తుంది. సహజంగా పోటీ బీజేపీ, తెరాస మధ్యనే ఉంటుంది. ఈటల వంటి గట్టి నాయకుడి వల్ల బీజేపీ, అధికారంలో ఉండటం వల్ల తెరాస కు కలిసి వస్తుంది. సహజంగా అయితే కాంగ్రెస్ కు ఇక్కడ డిపాజిట్ కూడా దక్కదు.

మెరుగ్గా రాణించింది అని అనిపించుకోకపోతే రేవంత్ ఇప్పుడు తీసుకొచ్చిన జోష్ నిలబడటం కష్టం. కాంగ్రెస్ హుజురాబాద్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి తెరాస వైపు మళ్లడంతో కొత్త అభ్యర్థిని వెతుక్కోవడంతో రేవంత్ తన పని మొదలుపెట్టాలి.

ADVERTISEMENT
Latest Stories