రేవంత్ పాదయాత్రకు హై కమాండ్ అనుమతి ఇవ్వలేదా?

Revanth Reddy to Make Osmania as His Fighting Turfఇటీవలే కాంగ్రెస్ లో జాయిన్ అయిన రేవంత్ రెడ్డికి అప్పుడే కాంగ్రెస్ హైకమాండ్ చుక్కలు చూపిస్తుంది. ఇదివరకే అనౌన్స్ చేసిన రేవంత్ రెడ్డి పాదయాత్రకు కాంగ్రెస్ హై కమాండ్ అనుమతి ఇవ్వడానికి నిరాకరించిందని సమాచారం. శుక్రవారం మీడియాతో మాట్లాడిన రేవంత్ డిసెంబర్‌ 9వ తేదీ నుంచి కార్యక్షేత్రంలోకి వస్తానని, ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండగడతానని అన్నారు.

అయితే ఆయన గతంలో ప్రకటించిన పాదయాత్ర గురించి మాత్రం ఏమి మాట్లాడలేదు. కొందరు పాత్రికేయులు ఆ మాట ఎత్తినా రేవంత్ రెడ్డి సమాధానం దాటవేశారు. దీనిబట్టి రేవంత్ రెడ్డి కి పర్మిషన్ రాలేదు అనే అనుకోవాలి. మరోవైపు డిసెంబర్ 9న రేవంత్ రెడ్డి గాంధీ భవన్ కు మొదటిసారి వెళ్లనున్నారు.

ADVERTISEMENT

కాంగ్రెస్ లో చేరిన తరువాత ఇప్పటిదాకా ఆయన గాంధీ భవన్ కు వెళ్ళింది లేదు. డిసెంబర్ 9న నుండి పాదయాత్ర అని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి ఆ రోజు నుండి గాంధీ భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టి గవర్నమెంట్ పై పోరాటం చెయ్యబోతున్నారన్నమాట. మొత్తానికి కాంగ్రెస్ అంటే ఏమిటో రేవంత్ రెడ్డి కి ఇప్పటికే తెలిసినట్టు ఉంది.

ADVERTISEMENT
Latest Stories