తెలంగాణాలో ఆర్ధిక మాంద్యాన్ని ఎదురుకోవడానికి తిప్పలు?

Telangana Government on Financial crisisతెలంగాణాలో ఆర్ధిక మాంద్యాన్ని ఎదురుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే తగ్గిపోతున్న ఆదాయం తో సతమతం అవుతున్న రాష్ట్ర దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొంతమేర ప్రజల మీద భారం వెయ్యాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మద్యం రేట్లు పెంచిన ప్రభుత్వం తాజాగా కరెంటు ఛార్జీలు కూడా పెంచడానికి సిద్ధం అవుతున్నారు.

ADVERTISEMENT

మరో పక్క భూములు రేట్లు పెంచడానికి కూడా సిద్ధం అవుతున్నారు. భూముల రిజిస్ట్రేషన్ విలువ మార్కెట్ విలువలో 60 శాతం వరకు ఉండాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుందని సమాచారం. ఆ మేరకు రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ దరలను పెంచాలని భావిస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

కొత్త సంవత్సరంలో దీని మీద ప్రకటన వచ్చే అవకాశం ఉందట. 2013లో ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా భూముల విలువలను పెంచారు. ఈ ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలు బాగా పెరిగాయి. దీనితో మార్కెట్ రేటుకు రిజిస్ట్రేషన్ రేటుకు భారీగా అంతరం ఏర్పడింది.

ఈ రేట్ల పెంపు వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరగడం వల్ల తో పాటు నల్ల ధనం కూడా బయటకు వస్తుంది. అయితే ఈ పెంపు స్థిరాస్తి రంగం మీదా, మరీ ముఖ్యం సొంత ఇల్లు కొనుక్కోవాలనే మధ్య తరగతి వారి మీద భారీగా ప్రభావం చూపించబోతుంది. అయితే ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో ఇంతకంటే ప్రభుత్వానికి వేరే ఆప్షన్ లేదు అంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories