గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై..!

Tamilisai Soundararajan

తెలంగాణ గవర్నర్ తమిళిసై తన పదవికి రాజీనామా చేసారు. ప్రత్యేక్ష ఎన్నికల మీద ఉన్న ఆస్తక్తితో రానున్న లోక్ సభ ఎన్నికలలో బీజేపీ తరుపున పోటీ చేయడానికి ఇటు తెలంగాణ గవర్నర్ పదవికి అటు పుదుచ్చేరి లెఫ్టనెంట్ గవర్నర్ పదవికి రెండిటికి రాజీనామా చేసారు తమిళిసై.

ADVERTISEMENT

2019 లో తమిళనాడులోని తుత్తక్కుడి లోకసభ నుండి పోటీ చేసిన తమిళిసై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కనిమొళి చేతిలో ఓడిపోయి అదే 2019 లో తెలంగాణ గవర్నర్ గా, 2012 పుదుచ్చేరి లెఫ్టనెంట్ గవర్నర్ గా బాధ్యతలు తీసుకున్నారు. అయితే గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో విభేదించిన తమిళిసై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలనే కొనసాగిస్తున్నారు.

అయితే ఈ గవర్నర్ పదవులకు రాజీనామా చేసిన తమిళిసై బీజేపీ నుండి చైన్నై సెంట్రల్ టిక్కెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. మరి తన సీటు పై బీజేపీ పెద్దల ఆమోదముద్రతోనే గవర్నర్ పదవి రాజీనామా చేశారా లేదా అనేది ఈ రోజు సాయంత్రం బీజేపీ లోక్ సభ టికెట్ల ప్రకటనతో తేలిపోనుంది.

ఒక వేళ ఆమె ఆశించినట్లే బీజేపీ ఆమెకు సీటు కేటాయించిన ఇన్నాళ్లుగా తెలంగాణలో ఉంటూ ఆ ప్రాంతానికి దూరంగా ఉన్న తమిళిసై విజయం సాధిస్తారా అనేది వేచి చూడాలి. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన తెలంగాణ గవర్నర్ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం ఎవరికీ అప్పగిస్తారనేదాని మీద అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి.

ADVERTISEMENT
Latest Stories