లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే ఇక జైలుకే!

telangana-traffic-police-jail-drivers-without-licenceడ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే తప్పించుకోవడానికి వీలు లేకుండా సరికొత్త నిబంధనలు అమలు కానున్నాయి. ఎంత కఠినంగా ఈ నిబంధనలు ఉండనున్నాయి అంటే, హీనపక్షంగా రెండు రోజులైనా జైలు శిక్ష అనుభ‌వించి తీరాల్సిందే. ఈ మేర‌కు సోమ‌వారం హైద‌రాబాద్ న‌గ‌ర ట్రాఫిక్ పోలీసులు, న్యాయ విభాగం మ‌ధ్య జ‌రిగిన స‌మావేశంలో జైలు శిక్ష విధించే నిర్ణ‌యం తీసుకున్నారు.

ట్రాఫిక్ కోర్టుల న్యాయ‌మూర్తులు, ట్రాఫిక్ విభాగం అధికారులు పాల్గొన్న ఈ స‌మావేశంలో… డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే నేటి నుంచే జైలుకు పంపించ‌నున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిని గుర్తించేందుకు ఆర్టీఏ అధికారుల‌తో క‌లిసి ఆటోలు, ద్విచ‌క్ర వాహనాల‌పై ప్ర‌త్యేక డ్రైవ్ నిర్వ‌హించ‌నున్న‌ట్టు డీసీపీ రంగ‌నాథ్ తెలిపారు. గ‌తేడాది చివ‌రి నాటికి న‌గ‌రంలో 50 ల‌క్ష‌ల వాహ‌నాలు రిజిస్ట‌ర్ అయితే సిటీలో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్‌ లు మాత్రం 20 ల‌క్ష‌లే.

ADVERTISEMENT

మొత్తం వాహ‌నాల్లో ద్విచ‌క్ర‌వాహ‌నాలు 45 ల‌క్ష‌లైతే ఆ త‌ర‌హా లైసెన్స్‌ లు కేవ‌లం ప‌ది ల‌క్ష‌లే. దీంతో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా దొరికితే వందో, యాభయ్యో చేతిలో పెట్టి త‌ప్పించుకునే వారిని ప‌ట్టుకోవాల‌ని స‌మావేశంలో నిర్ణ‌యించారు. లైసెన్స్ లేకుండా బండి న‌డుపుతూ ప‌ట్టుబ‌డిన వారిపై కోర్టులో అభియోగ ప‌త్రాలు దాఖ‌లు చేసి జైలుకు పంపించాల‌ని నిర్ణ‌యించారు. దీనిని బట్టి లైసెన్స్ లేకుండా ఎవరూ బండెక్కవద్దని పరోక్షంగా చెప్పకనే చెప్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories