టాలీవుడ్ హీరోలు – ఒకరికి జైలు శిక్ష… మరొకరిని అరెస్ట్..!

Telugu Actor Abhishek & Pawan kumar Arrestedసినీ ఇండస్ట్రీపై ఉన్న మోజు, ఆకర్షణతో పరిశ్రమలోకి వస్తున్న వారంతా నిలకడగా ఉండడం లేదన్న విషయం బహిరంగమే. అయితే ఒకటి, అర సినిమాలలో నటించిన వారు కూడా పెడద్రోవ పడుతున్నారన్న సంకేతాలను టాలీవుడ్ ఇస్తోంది. ‘ఐతే’ సినిమాలో ఉన్న నలుగురు స్నేహితులలో ఒకడిగా కీలక పాత్ర పోషించిన నటుడు అభిషేక్ ను పోలీసులు అరెస్ట్ చేసారు.

డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అభిషేక్ ను సికింద్రాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభిషేక్ తో పాటు మరో ఐదుగురిని కూడా అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు నైజీరియా దేశానికి చెందిన వారు కాగా, వీరి వద్ద నుంచి 370 గ్రాముల కొకైన్, 46 వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఎప్పటి నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తోంది, ఎవరెవరికి సరఫరా చేస్తోంది, వీరి వెనక ఎవరున్నారు తదితర అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ADVERTISEMENT

ఇదిలా ఉంటే, మరో యువ హీరో పవన్ కుమార్ కు సంగారెడ్డి న్యాయస్థానం జైలు శిక్షను విధించింది. ‘నీతోనే నేనున్నా’ చిత్రంలో హీరోగా నటించిన పవన్ కుమార్ చేసిన చెక్ బౌన్స్ కేసులో ఈ శిక్ష పడింది. అలాగే బాధితుడికి 1.5 కోట్లు చెల్లించాలని సదరు తీర్పులో ఆదేశించింది. ఒకే రోజు ఇద్దరి యువ నటులపై చట్టం చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది.

ADVERTISEMENT
Latest Stories