ట్రంప్ గెలుపు వెనుక ఉన్నది మన తెలుగు వ్యక్తే!

Telugu man behind Donald Trump Victoryఅమెరికా అధ్యక్ష పదవిలో హిల్లరీ క్లింటన్ ఖచ్చితంగా కూర్చుంటుందని సర్వేలు, నిపుణులు, చివరికి ప్రజలు కూడా అంచనా వేయగా, అందరినీ అవాక్కు చేస్తూ డోనాల్డ్ ట్రంప్ జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఓ విధంగా అమెరికా ప్రజలనే కాదు, ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసిన ఈ ఘటనకు కారణం ఏమిటో ఎవరికీ అంతు పట్టలేదు. ఓ వైపు దేశ ప్రజానీకం ‘మాకు ఈ అధ్యక్షుడు వద్దూ’ అంటూ నిరసనలు చేస్తూ ఉండగా, ఎలా పదవిలోకి వచ్చారన్నది ఓ మిస్టరీగా మారింది.

ADVERTISEMENT

[m9ad]

అయితే తాజాగా ఆ మిస్టరీ వీడిపోయింది. ట్రంప్ విజయం వెనుక అసలు సూత్రధారి ఎవరో ప్రపంచానికి తెలిసిపోయింది. ట్రంప్ అనూహ్య విజయం వెనుక ఉన్నది మరెవరో కాదు… మన తెలుగు వాడైన కేఏ పాల్ అన్న విషయం తేలింది. తాజాగా సోషల్ మీడియాలో చేసిన ట్వీట్లతో, పాల్ ఈ నిజాన్ని బట్టబయలు చేసారు. అంతేకాదు ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీకి ఓ బంపర్ ఆఫర్ కూడా ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడికి తెలుగుదేశం పార్టీకి లింక్ ఏమిటని బుర్రలు చించుకోవాల్సిన పనిలేదు.

మన పాల్ గారి దృష్టిలో సర్వం ఆయన చేయిస్తున్నట్లుగానే మాట్లాడతారు కదా! అమెరికా అధ్యక్షుడ్ని గెలిపించిన తనకు, లోకేష్ ను ఓ ఎమ్మెల్యేగా గెలిపించడం పెద్ద విషయమేమీ కాదని ఈ సందర్భంగా తెలిపారు. ట్రంప్ కు వెనకుండి ప్రచారం చేసినట్లుగానే లోకేష్ కు కూడా తానూ ప్రచారం నిర్వహిస్తానని, వెనక్కి తగ్గవద్దని ధైర్యం చెప్పారు. ఇదంతా విని ఎవరికైనా నవ్వు వస్తే అది పాల్ గారి తప్పు మాత్రం కాదు. ఎందుకంటే… తానేం చేయగలనో ట్రంప్ ద్వారా మరోసారి ప్రపంచానికి చాటిచెప్పానని చెప్పుకుంటున్నారు కాబట్టి!

ADVERTISEMENT
Latest Stories